Nandamuri Mokshagnya: ఫస్ట్ లుక్ తోనే కేక పుట్టిస్తోన్న మోక్షజ్ఞ .. సింబాగా రాబోతున్న నందమూరి వారసుడు..

Nandamuri Mokshagnya: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు..  నందమూరి నట సింహం బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూసారు. వాళ్ల ఎదురు చూపులు ఫలించాయి. లేట్ అయినా.. లేటెస్ట్ గా తన కుమారుడిని ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసారు బాలయ్య. అంతేకాదు ఈ రోజు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 6, 2024, 11:23 AM IST
Nandamuri Mokshagnya: ఫస్ట్ లుక్ తోనే  కేక పుట్టిస్తోన్న మోక్షజ్ఞ .. సింబాగా రాబోతున్న నందమూరి వారసుడు..

Nandamuri Mokshagnya: ఈ రోజు మోక్షజ్ఞ బర్త్ సందర్బంగా ఆయన సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు మోక్షు ఫస్ల్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. హాండ్సమ్ లుక్ తో మోక్షజ్ఞ కెవ్వు కేక పుట్టిస్తున్నాడు. అంతేకాదు సింహం కడుపున సింహమే అన్నట్టుగా అభిమానులు మోక్షు ఫస్ట్ లుక్ పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమా పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మాత వ్యవహరిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్ పతాకం బాలయ్య కూతురు తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు. హనుమాన్ తర్వాత పూర్తి సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు చెప్పుకొచ్చారు.

మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ.. తెలుగు తెరపై ఇప్పటి వరకు తెరకెక్కని సబ్జెక్ట్ తో సోషియో ఫాంటసీ.. మైథాలజీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలకమైన భగవంతుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సింబా అని టైటిల్ పెట్టబోతున్నారా. లేకపోతే.. సింహా తనయుడని మోక్షుకు సింబా అనే బిరుదు ఇచ్చారా అనేది చూడాలి. ఏది ఏమైనా ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది.
 
గత దశాబ్ద కాలంగా బాలయ్య ఫ్యాన్స్ ఆయన తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎపుడు ఇస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  అందకు తగ్గట్టు మోక్షు బర్త్ డే సందర్బంగా బిగ్ అప్ డేట్ ఇచ్చారు.

ఇప్పటికే మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయనట్టు సమాచారం.  త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మోక్షజ్ఞ కోసం ఇప్పటికే బాలయ్య ఐదారు కథలను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడు వచ్చి 19 ఏళ్లు అవుతుంది.మరి ముఖ్యంగా బాలయ్య తనయుడు  మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కూడా  ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు.

ఇక  మోక్షజ్ఞ  సినీ ఎంట్రీ ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ఆదిత్య 999 మాక్స్ మూవీతో ఎంట్రీ ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలయ్య ఈ విసయాన్ని పలు మార్లు కన్ఫామ్ చేసారు.ఇప్పటికే  మోక్షు నటనతో పాటు హీరో సంబంధించిన డాన్స్, ఫైట్స్ అన్నింటిలో ట్రెయిన్ అయ్యాడు. తాజాగా స్లిమ్ లుక్ లో కత్తిలా కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ కొత్త సినిమాతో  శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ గా పరిచయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News