Bellamkonda Sreenivas: హిట్ కోసం బెల్లకొండ శ్రీనివాస్ మరో ప్రయోగం.. ఆ సెన్సేషనల్ డైరెక్టర్‌తో అయినా లక్ మారేనా..!

Vijay Kumar Kanakamedala: ఎప్పటినుంచో తెలుగులో రీమెక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇతర భాషలలో మంచి విజయం సాధించిన చిత్రాలను.. మన భాషకు తగినట్టు తీస్తే చాలు.. అవి బ్లాక్ బస్టర్ అందుకున్న సమయాలు ఎన్నోసార్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు నాంది లాంటి సినిమాని తెరకెక్కిచ్చిన విజయ్ కనకమెడల.. బెల్లంకొండ శ్రీనివాస్ కోసం మరొక రీమేక్ చిత్రంతో రానున్నారు..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 6, 2024, 11:38 AM IST
Bellamkonda Sreenivas: హిట్ కోసం బెల్లకొండ శ్రీనివాస్ మరో ప్రయోగం.. ఆ సెన్సేషనల్ డైరెక్టర్‌తో అయినా లక్ మారేనా..!

Bellamkonda Sreenivas Upcoming Movies: కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. అయితే కొద్ది కాలం ఈ హీరోకు.. వరుస ఫ్లాపులు తప్పలేదు. ఇక అల్లరి నరేష్ పని అయిపోయింది అని అనుకున్నారు.. అందరూ. కానీ అలాంటి టైంలో అతని.. కెరీర్ కి మరో దారి చూపించారు డైరెక్టర్ విజయ్ కుమార్ కనకమేడల. అంది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అల్లరి నరేష్ కి అందించారు. 

కాగా ఈ డైరెక్టర్ తన రెండో సినిమా కూడా అల్లరి నరేష్ తోనే చెయ్యడం విశేషం. తన రెండో సినిమాగా అల్లరి నరేష్ తో.. ఉగ్రం అనే చిత్రం తీశారు. ఈ సినిమా నాంది అంత సక్సెస్ అందుకోలేక పోయినా.. పర్వాలేదు అనిపించకుంది. ఈ క్రమంలో ఇప్పుడు తన మూడవ సినిమాగా.. రీమేక్ ని ఎంచుకున్నారు ఈ డైరెక్టర్.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ కి కథ చెప్పి.. ఈ మధ్యనే ఒప్పించారు అని వినికిడి. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే టైసన్ నాయుడుతో పాటు మరో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే పనిలో ఉన్నారు. ఈ రెండు ముగిసిన తర్వాత.. విజయ్ కుమార్ తో అతను చేయనున్న అఫీషియల్ గా అనౌన్స్ కానుంది. కాగా ఈ చిత్రం ఒక సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అని వినికిడి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన  స్క్రిప్ట్ మార్పులను విజయ్ కుమార్ కంప్లీట్ చేసినట్లు సమాచారం.

 మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ చిత్రాన్ని మల్టీస్టారర్ గా తెరకెక్కించనున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో మెయిన్ హీరోగా కనిపించనుండగా.. మంచు మనోజ్ కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరితో పాటు ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నారా రోహిత్ కూడా కనిపించనున్నారని సమాచారం. మరి ఈ చిత్రం ఈ దర్శకుడికి అలానే బెల్లంకొండ శ్రీనివాస్ కి ఎలాంటి విజయం సాధించి పెడుతుందో వేచి చూడాలి.

Also Read: Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..

Also Read: Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News