Kolkata Doctor Rape And Murder Case: కోల్ కతా మెడికో హత్యాచారం కేసులో కీలక పరిణామం..ఆర్ జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్

CBI Arrests Ex Principal Of RG Kar : కోల్ కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్జీకర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తోపాటు, ఓ పోలీస్ అధికారిని సిబిఐ అరెస్టు చేసింది. 

Written by - Bhoomi | Last Updated : Sep 14, 2024, 11:17 PM IST
Kolkata Doctor Rape And Murder Case: కోల్ కతా మెడికో హత్యాచారం కేసులో కీలక పరిణామం..ఆర్ జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్

CBI Arrests Ex Principal Of RG Kar :  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగాల్ లోని కోల్ కతా ఆర్జీకర్ కళాశాల జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సీబీఐ అరెస్టు చేసింది. ఆయనతోపాటు మరో పోలీస్ అధికారిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. మెడికల్ కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో అరెస్టు అయ్యాడు. 

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసు దర్యాప్తులో సిబిఐ జోరు పెంచింది. కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, కోల్‌కతా పోలీస్ అధికారి అభిజీత్ మండల్‌లను అరెస్టు చేసింది. కోల్‌కతా మెడికో విద్యార్థిని లైంగిక దాడి హత్య కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు అదృశ్యమైనందుకు సిబిఐ డాక్టర్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసినట్లు తెలిపింది. సందీప్ ఘోష్‌తో పాటు ఎస్‌హెచ్‌ఓ అభిజీత్ మండల్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అభిజీత్ మండల్ తాలా పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

Also Read: Ayushman Bharat Card: సీనియర్ సిటిజన్స్  ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలి? కొత్త ఆయుష్మాన్ భారత్ కార్డును ఎక్కడ పొందాలి..?  

సాక్ష్యాలను తారుమారు  చేయడం  దర్యాప్తును తప్పుదారి పట్టించడం వంటి ఆరోపణలపై సందీప్ ఘోష్, అభిజీత్ మండల్‌లను అరెస్టు చేశారు. ఆర్‌జి కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ప్రత్యేక కేసులో సందీప్ ఘోష్‌ను గతంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. ఇదిలా ఉంటే సందీప్ ఘోష్‌కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష కూడా నిర్వహించింది. ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం  హత్య కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించడానికి కలకత్తా హైకోర్టు గత నెలలో సిబిఐకి మూడు వారాల సమయం ఇచ్చింది. నివేదికను సెప్టెంబర్ 17న కోర్టు ముందుంచాల్సి ఉంది.

Also Read: One Rank One Pension Scheme: విశ్రాంత సైనికులకు గుడ్‎న్యూస్..వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంపై కేంద్రం కీలక నిర్ణయం

ఇదిలా ఉంటే సందీప్ ఘోష్‌ను ఆదివారం సీల్దా కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తులో జాప్యం, సాక్ష్యాలను తారుమారు చేయడంలో సందీప్ ఘోష్ మరియు కోల్‌కతా పోలీస్ ఎస్‌హెచ్‌ఓ ఇద్దరూ ప్రమేయం ఉన్నారని సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది.

ఇదిలా ఉంటే కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో ఆగస్టు 9వ తేదీన 31 ఏళ్ల మహిళా డాక్టర్ మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యింది. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత కోల్‌కతా పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తమ నిరసన వ్యక్తం చేశారు. 

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అభిజిత్ మండల్‌లను సిబిఐ అరెస్టు చేయడంపై కేంద్ర మంత్రి సుకాంత్ మజుందార్ మాట్లాడుతూ..ఈ రోజు చేసిన అరెస్టులు చాలా ముఖ్యమైనవన్నారు. ముఖ్యంగా తాళా పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్‌ ఇన్‌చార్జిని అరెస్టు చేయడాన్ని ఆయన హర్షించారు. ఒక చిన్న స్టేషన్‌ ఇన్‌చార్జి ఇలాంటి నిర్ణయం తీసుకోగలరా అన్నది నా ప్రశ్న. అతనికి పై నుండి సూచనలను అంది ఉంటాయి. అందుకే పైస్థాయి వ్యక్తులను అరెస్టు చేసి, దర్యాప్తు చేయాలని సుకాంత్ మజుందార్ పేర్కొన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News