Ask Nani:నాని హీరోగా చేసిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేది దగ్గర పడుతూ ఉండడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ జోరు కొనసాగిస్తున్నారు హీరో నాని. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో అభిమానులతో Q అండ్ A సెక్షన్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ఆయన అభిమానులు ఆయన ఎన్నో ప్రశ్నలు అడగగా వాటికి ఇంట్రెస్టింగ్ జవాబులు ఇచ్చారు.
#AskNani అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో గంటపాటు ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్ పై అడిగిన ప్రశ్నకు వెంటనే నాని వేణు (బలగం) అని ట్వీట్ చేయగానే అందరూ రకరకాలుగా స్పందించారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటి అంటే.. మీకు ప్రస్తుతం ఉన్న అప్కమింగ్ డైరెక్టర్స్ లో ఎవరితో సినిమా చేయాలని ఉంది అని అడగగా దానికి సమాధానంగా నాని.. వేణు బలగం అని జవాబు ఇచ్చారు. ఇలా నాని ఒక్క సినిమాతో ఫేమస్ అయినా జబర్దస్త్ వేణు పేరు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు.
Venu (Balagam)#AskNani #HiNanna https://t.co/mQYllIZKEm
— Hi Nani (@NameisNani) December 4, 2023
కాగా జబర్దస్త్ షో అలానే సినిమాలలో కామెడీ యాక్టర్ గా మనకు బాగా పరిచయమైన వేణు ఈ మధ్య బలగం అని ఎమోషనల్ డ్రామా తీసి ఎన్నో అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ దర్శకుడు ఇప్పుడు నాని చెప్పిన జవాబుతో.. మరింత ఖుషి అయ్యి నానికి ఏదైనా స్క్రిప్ట్ రాస్తారేమో చూడాలి.
మరోపక్క కొత్తదనాన్ని అలానే కొత్త దర్శకులను ఎప్పుడూ పరిచయం చేసే నాని ప్రస్తుతం తన చిత్రం హాయ్ నాన్న కూడా కొత్త దర్శకుడు తో చేయడం విశేషం. హాయ్ నాన్న సినిమా ద్వారా శౌర్యువ్ అనే కొత్త దర్శకుడిని నాని పరిచయం చేస్తున్నారు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి హిట్ ఇస్తుందో తెలియాలి అంటే ఈ గురువారం వరకు వెయిట్ చేయాలి.
Paid premiers లేవు
AMB lo 6th evening few shows for select people and media.
6th రాత్రి కళ్ల ఉందా ఊడిందా మీకు తెలిసిపోతుంది.
ఉండిపోతుంది ఎప్పటికీ అని నా feeling :)#AskNani #HiNanna https://t.co/XZnNaxEF3J— Hi Nani (@NameisNani) December 4, 2023
కాగా మరో నేటిజన్ ఈ సినిమాకి ప్రీమియర్స్ ఉంటాయా లేదా అని నానిని అడగగా…మీడియా వారికి అలానే కొంతమంది సినిమా ఇండస్ట్రీ వారికి ప్రీమియర్స్ ఉంటాయి కానీ పబ్లిక్ కి లేవు అని.. అయితే ఈ సినిమా ఉందా. ఉడిందా.. డిసెంబర్ 6న తేలిపోతుందని.. అయితే సినిమా తప్పకుండా ఎప్పటికీ మన హృదయాలలో ఉంటుంది అనే నమ్మకం తనకు ఉంది అని నాని చెప్పుకొచ్చారు.
Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు
Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
నా సినిమా ఉందా.. ఊడిందా ఆ రోజు తెలుస్తుంది.. ఆ చిన్న డైరెక్టర్ తో పని చేయాలని ఉంది :