Rhea Chakraborty in trobule: ఎక్కడో బీహార్ రాష్ట్రంలో పుట్టి బాలీవుడ్ హీరోగా ఎదిగి పోవాలనే ఆశతో ముంబైలో అడుగు పెట్టాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. హీరోగా నిలదొక్కుకున్నాడు కానీ ఏమైందో తెలియదు కరోనా సమయంలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. ఆయన మరణానికి కారణాలు ఎన్నో ఉన్నాయని రకరకాల వాదనలు ఉన్నాయి. కానీ నిజంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకేమైనా జరిగిందా అనే విషయం మీద కూడా పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయారు.
పోలీసులు ఆత్మహత్య అంటూ కేసు క్లోజ్ చేసే సమయానికి సీబీఐ రంగంలోకి దిగి ఈ కేసును విచారిస్తోంది. కానీ ఎప్పటికీ ఈ వ్యవహారం తేలుతుందో తెలియదు. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి విషయంలో ఒక కీలక కేసు నమోదు అయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని పోలీసులు గుర్తించడంతో ఈ కేసులో ఎన్సీబీ ఎంటరై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో గతంలో రియా చక్రవర్తి అరెస్టయి జైలు శిక్ష కూడా అనుభవించి బయటికి వచ్చింది.
ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నా కానీ ఇప్పుడు ఆమె మీద మరిన్ని సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ నమోదు చేసినట్లు సమాచారం. ఆమె నేరుగా గంజాయి సహా మాదక ద్రవ్యాలు కొన్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు అయ్యేందుకు ఆమె కారణమని గుర్తించారు. ఇక ఈ కేసు గనక నిజమేనని తేలితే ఆమెకు సుమారు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ పితాని అనే యువకుడు కూడా ఈ కేసులో చిక్కుకున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి చెందిన కోటక్ బ్యాంక్ యాప్ ని సిద్ధార్థ వాడేవాడని పూజా సామాగ్రి పేరుతో ఆ యాప్ ద్వారా గంజాయికి ఇతర మాదకద్రవ్యాలకు డబ్బులు చెల్లించాడని తెలుస్తోంది. ఈ విషయంలో అటు రియా చక్రవర్తి సహా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి కూడా శిక్షపడే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క సిద్ధార్థ్ పితాని కూడా చిక్కుల్లో పడ్డారు.
Also Read: Pelli SandaD: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్దం.. ఏ రోజు టెలీకాస్ట్ అంటే?
Also Read: Supermoon: వినీలాకాశంలో అరుదైన అద్భుతం.. భూమికి దగ్గరగా కనువిందు చేయనున్న సూపర్ మూన్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook