Malli Pelli Movie: మళ్లీ పెళ్లి సినిమా ఆపాలంటూ.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పిటిషన్‌!

Actor Naresh 3rd Wife Ramya Raghupathi Files a Case on Malli Pelli Movie. మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతి కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 25, 2023, 02:34 PM IST
Malli Pelli Movie: మళ్లీ పెళ్లి సినిమా ఆపాలంటూ.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పిటిషన్‌!

Actor Naresh 3rd Wife Ramya Raghupathi Files a Case on Malli Pelli Movie: టాలీవుడ్ సీనియర్‌ నటుడు నరేశ్‌, అతడి ప్రేయసి పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎమ్‌ఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నరేశ్ తన సొంత బ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై తెరకెక్కిస్తున్నాడు. నరేశ్‌ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కినన్న మళ్లీ పెళ్లి సినిమా మే 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌ అందరిలో ఆసక్తిని రేకెత్తిచింది. 

మళ్లీ పెళ్లి సినిమా నుంచి నరేశ్‌, పవిత్రల లిప్‌ లాక్‌ వీడియో రిలీజ్‌ అయినప్పటి నుంచి వీరిద్దరి వీటవీహరం పెద్ద సెన్సేషన్‌గా మారింది. నరేశ్‌ నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సినిమాలో ఉండటమే ఇందుకాజు కారణం. నరేష్ మూడు పెళ్లిళ్లు, పవిత్రతో ప్రేమ, హోటల్‌లో పట్టుబడ్డ సీన్‌ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పవిత్రను పెళ్లి చేసుకుంటానని నరేష్ చెప్పడం విశేషం. ఇవన్నీ సినిమాపై మంచి హిప్ తీసుకొచ్చాయి. సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. 

మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతి కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. మళ్లీ పెళ్లి సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని, ఈ సినిమాని రిలీజ్ ఆపాలంటూ పిటిషన్‌ వేశారు. దాంతో రేపు మళ్లీ పెళ్లి సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. 

కొన్నాళ్లుగా నరేశ్‌ నిజ జీవితంలో జరిగిన మరియు జరుగుతున్న వ్యవహారాలను డైరెక్టర్‌ ఎంఎస్ రాజు ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో స్పష్టం అయింది. నరేశ్, పవిత్రా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే టైటిల్‌తో సినిమా చేయడం తెలుగు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Also Read: Surya Gochar 2023: మిధున రాశిలోకి సూర్యుడు.. మీన రాశితో సహా ఈ వ్యక్తులు ధనవంతులవడం పక్కా!  

Also Read: Jinal Joshi Bold Pictures: ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా.. బాత్ టబ్‌లో హాట్ స్టిల్స్ ఇచ్చిన జినాల్ జోషి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

More Stories

Trending News