Navya Swamy Ravikrishna :రవికృష్ణ అదరగొట్టేశావ్.. విరూపాక్షపై నవ్యస్వామి రివ్యూ.. హీరోకి మాత్రం నో క్రెడిట్

Navya Swamy About Ravikrishna నవ్యస్వామి తాజాగా రవికృష్ణ గురించి ఓ పోస్ట్ వేసింది. సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో రవికృష్ణ ఓ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో రవికృష్ణ పర్ఫామెన్స్ గురించి మాత్రమే నవ్యస్వామి నటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 07:23 PM IST
  • బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష సందడి
  • సాయి ధరమ్ తేజ్‌కు భారీ హిట్
  • రవికృష్ణపై మాత్రమే నవ్యస్వామి ఫోకస్
Navya Swamy Ravikrishna :రవికృష్ణ అదరగొట్టేశావ్.. విరూపాక్షపై నవ్యస్వామి రివ్యూ.. హీరోకి మాత్రం నో క్రెడిట్

Navya Swamy About Ravikrishna నవ్యస్వామి, రవికృష్ణల మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే రూమర్లు ఎంతగా వ్యాప్తి చెందుతుంటాయో అందరికీ తెలిసిందే. నవ్యస్వామి, రవికృష్ణలు కలిసి చేసిన ఆమె కథ సీరియల్‌తో ఈ ఇద్దరి కెమెస్ట్రీ సెట్ అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఏ షోకు వెళ్లినా కూడా రొమాంటిక్ ట్రాక్ వర్కౌట్ చేస్తూనే వస్తున్నారు. బయటి షోల్లో కాస్త రొమాన్స్ చేస్తుండటంతో ఈ ఇద్దరి జోడి ట్రెండింగ్‌లోకి వచ్చేస్తూ ఉంటుంది.

నవ్యస్వామి, రవికృష్ణలిద్దరూ కూడా ఇప్పుడు బుల్లితెరకు దూరంగా వెండితెరపై అవకాశాలను సంపాదించే బిజీలో ఉన్నారు. నవ్యస్వామి అయితే సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ బాగానే బిజీగా మారింది. రవికృష్ణకు ఇంకా సరైన పాత్రలు పడటం లేదు. కానీ ఆయన మాత్రం బాడీని పెంచేస్తూ హీరో మెటీరియల్ అని అనిపించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు విరూపాక్ష సినిమాలో రవికృష్ణ ఓ మంచి పాత్రను పోషించాడు.

మధ్యలోనే ముగిసే పాత్రే అయినా కూడా రవికృష్ణ ఉన్నంత సేపు బాగానే మెప్పిస్తాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని నవ్యస్వామి చెప్పుకొచ్చింది. నువ్ అదరగొట్టేశావ్ రవికృష్ణ.. సినిమా బ్లాక్ బస్టర్.. ఎంత గ్రిప్పింగ్‌గా సినిమాను తీశారు.. అదిరిపోయింది.. అంటూ కార్తీక్ దండు గురించి చెప్పింది. ఇక శ్యాం దత్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పుకొచ్చింది. అయితే ఇందులో సాయి ధరమ్ తేజ్‌కు మాత్రం క్రెడిట్ ఇవ్వలేదు.. సాయి ధరమ్ తేజ్ గురించి ఎక్కడా చెప్పలేదు.

Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక

సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అదనపు బలం అని చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు. కథ, కథనం ఎంతో గ్రిప్పింగ్‌గా ఉందని, చేతబడి మీద ఇప్పటి వరకు సినిమాల్లో ఇదే బెస్ట్ సినిమా అని చెప్పుకుంటున్నారు. దీంతో సుకుమార్ శిష్యుల డెబ్యూ సినిమా అదిరిపోతాయ్ అని, సుకుమార్ శిష్యులు మామూలోళ్లు కాదని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ఇది కూడా వంద కోట్ల క్లబ్బులోకి చేరుతుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News