RRR Logo: ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

RRR : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్ అప్‌డేట్‌పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

Last Updated : Jan 24, 2020, 12:48 PM IST
RRR Logo: ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బహుబలి లాంటి ప్రపంచ స్థాయి తర్వాత తీస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో RRR మూవీ యూనిట్ చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అంటే ఏమిటో త్వరలో వెల్లడిస్తామని, లోగో కూడా విడుదల చేస్తామని అధికారిక ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. అజయ్ దేవగణ్ తమ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని మూడు రోజుల కిందట ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read: RRRపై ఆ వదంతులు నమ్మవద్దు: కిచ్చా సుదీప్

ఇది గమనించిన అశోక్ కోహ్లీ అనే ఓ నెటిజన్..  RRR అంటే ఏమిటి అని ట్వీట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ అంటే సినిమా టైటిల్ అని, త్వరలో అబ్రివేషన్ వెల్లడిస్తామని పోస్ట్ చేయడమే నెటిజన్లకు ఆయుధంగా మారింది. మేం అడిగితే బదులివ్వరు కానీ, బాలీవుడ్ వాళ్లు అడిగితే బదులిస్తారు. మేమంటే మీకు అంత చులకనా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీని చూసేందుకు ఎదురుచూస్తున్నామని కొందరు పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. బాహుబలి ప్రాజెక్టు సినిమాలు సైతం చాలాకాలం ఎదురుచూసిన తర్వాత రావడం అభిమానుల సహనాన్ని పరీక్షించాయని చెప్పవచ్చు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న RRR అంటే ఏమిటో యూనిట్ వెల్లడిస్తుందేమోనని కొందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలో అంటే కనీసం 4 లేక 5 నెలలైనా పడుతుందా సార్ అంటూ ఆర్ఆర్ఆర్ మూవీ ట్వీట్‌పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. త్వరలో అంటే కనీసం దసరా పండుగ వరకు ఎదురుచూడాలా సార్ అని వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైతేనేం ఆర్ఆర్ఆర్ మూవీకి కావాల్సిన ప్రమోషన్ వస్తుంది.

తెలంగాణా యోధుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించనుండగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ పాల్గొన్నారు.                   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News