RRRపై వదంతులు నమ్మవద్దు: కిచ్చా సుదీప్

Kichcha Sudeep | రాజమౌళితో కిచ్చా సుదీప్‌కు అనుబంధం ఉంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ, బాహుబలి సినిమాలలో సుదీప్ నటించాడు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ త్వరలో షూటింగ్‌లో పాల్గొంటారని, పోలీసు పాత్రలో ఆయన కనిపించనున్నారని కథనాలు వచ్చాయి.

Last Updated : Jan 19, 2020, 12:16 PM IST
RRRపై వదంతులు నమ్మవద్దు: కిచ్చా సుదీప్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బహుబలి 2 తర్వాత తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్‌ తెలంగాణా యోధుడు కొమరం భీంగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరో RRR ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నాడని ప్రచారం జరిగింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ త్వరలో షూటింగ్‌లో పాల్గొంటారని, పోలీసు పాత్రలో ఆయన కనిపించనున్నారని కథనాలు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ మూవీలో తాను నటించడంపై కిచ్చా సుదీప్ స్పందించారు. అవన్నీ కేవలం వదంతులేనని, తాను ఆర్ఆర్ఆర్ మూవీలో నటించడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా అన్ని విషయాలు తెలిపారు. తాను ఈ సినిమాలో నటిస్తున్నానని ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారని, అయితే అందులో నిజం లేదన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయమై తనను ఇప్పటివరకూ ఎవరూ సంప్రదించలేదని, తనను కనీసం ఎలాంటి చర్చ కూడా జరగలేదని స్పష్టం చేశారు.

రాజమౌళితో కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌కు అనుబంధం ఉంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ, బాహుబలి సినిమాలలో సుదీప్ నటించాడు. దీంతో తాజా ప్రాజెక్టులోనూ సుదీప్ భాగస్వామి అయ్యాడని చెప్పగానే ఫ్యాన్స్ నమ్మేశారు. కీలకమైన పోలీసు అధికారి పాత్రలో సుదీప్ నటించనున్నారని కథనాలు చూసి సినిమాపై కాస్త హైప్ పెరిగింది. అయితే తాను ఈ ప్రాజెక్టులో పని చేయడం లేదని సుదీప్ వెల్లడించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News