Bheemla Nayak: నాన్ థియేట్రికల్ రైట్స్‌లో భీమ్లా నాయక్ మూవీకి భారీ వసూళ్లు!

Bheemla Nayak Non Theatrical Rights: భీమ్లా నాయక్‌ మూవీ యూనిట్‌కు.. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఒక గుడ్‌ న్యూస్‌ వచ్చేసింది. నాన్ థియేట్రికల్ రైట్స్‌ విషయంలో భీమ్లా నాయక్‌ భారీ వసూళ్లు రాబట్టింది. మలయాళం సినిమా అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 09:41 PM IST
  • ఈ నెల 25వ తేదీన పవన్ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ మూవీ రిలీజ్‌
  • ఈ మూవీ రిలీజ్‌కు ముందే మరో బజ్ క్రియేట్
  • భీమ్లా నాయక్‌ సినిమా డబ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ వంటి వాటికి భారీగా అమౌంట్‌
  • దాదాపు 70 కోట్ల రూపాయలు పలికిన నాన్ థియేట్రికల్ రైట్స్
Bheemla Nayak: నాన్ థియేట్రికల్ రైట్స్‌లో భీమ్లా నాయక్ మూవీకి భారీ వసూళ్లు!

Bheemla Nayak Movie Latest Updates: పవన్ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ మూవీ ఈ నెల 25వ తేదీనే రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మూవీ యూనిట్ ఇటీవల అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. 

ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందే మరో బజ్‌ని క్రియేట్ చేసింది. భీమ్లా నాయక్‌ సినిమా డబ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ వంటి నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 70 కోట్ల రూపాయల వరకు అమ్ముడపోయాయని తెలుస్తోంది. 

ఇక భీమ్లా నాయక్‌ సినిమా కాస్త ఆలస్యంగా రిలీజ్‌ అవుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ముందుగా చెప్పిన డేట్‌కే రిలీజ్ చేస్తున్నామంటూ మూవీ యూనిట్‌ తెలపడంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. 

పవన్‌ కల్యాణ్‌, రానా కాంబోలో వస్తోన్న ఈ మూవీ సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. త్రివిక్రమ్‌ మాటలు అందించారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని రూపొందించారు. 

భీమ్లా నాయక్‌ సినిమాలో నిత్యామీనర్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్‌‌ హిట్‌ అయి అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్‌ అందించాడు.

Also Read: Giloy Benefits: తిప్పతీగ తింటే లివర్‌ పాడవుద్దా?.. కేంద్రం ఏం చెబుతోంది?

Also Read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News