Karthikeya 2: నిఖిల్ 'కార్తికేయ 2'లో క్యారెక్టర్స్ ను పరిచయం చేసిన మేకర్స్.. ఆసక్తి రేపుతున్న పోస్టర్స్..!

Karthikeya 2: నిఖిల్ 'కార్తికేయ 2' చిత్రం నుంచి అప్ డేట్ వచ్చింది. క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ.. చిత్రబృందం తాజాగా పోస్టర్స్ ను రిలీజ్ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2022, 07:14 PM IST
  • నిఖిల్ 'కార్తికేయ 2' అప్ డేట్
  • కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసిన మేకర్స్
  • జూలై 22న సినిమా రిలీజ్
Karthikeya 2: నిఖిల్ 'కార్తికేయ 2'లో క్యారెక్టర్స్ ను పరిచయం చేసిన మేకర్స్.. ఆసక్తి రేపుతున్న పోస్టర్స్..!

Nikhil- Karthikeya 2 Movie: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం 'కార్తికేయ 2' (Karthikeya 2). చందు మెుండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇందులో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన పోస్టర్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో ‘కార్తికేయ’ రాగా.. ఈసారి ద్వారకా నగర రహస్యాన్ని కనిపెట్టే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ‘కార్తికేయ-2’ తెరకెక్కుతోంది. 

ఇందులో కార్తికేయగా నిఖిల్ నటిస్తుంటే...ముగ్ధ అనే పాత్రలో అనుపమ నటించింది. ప్రధానమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కనిపిస్తుండగా.. సదానందగా శ్రీనివాసరెడ్డి నటిస్తున్నారు. ఈ మేరకు పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ సినిమా జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం మరియు హిందీలో కూడా డబ్ చేయనున్నారు. 

Also Read: Pushpa Part 2: పుష్ప 2 ఎలా ఉంటుంది, కధనంలో లెక్కల మాస్టారు ఏ మార్పులు చేశారు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x