Murali Mohapatra Death Reason: పాటలు పాడుతూనే ప్రముఖ సింగర్ మృతి.. ఏమైందంటే?

Odia Singer Murli Mohapatra Dies Due To Heart Attack: ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెన్నంటుతున్నాయి, సింగర్ కేకే ఎలా అయితే పాటలు పాడుతూ కన్నుమూశారో అలానే మరో సింగర్ కన్నుమూశారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 4, 2022, 11:38 AM IST
  • పాటలు పాడుతూనే ప్రముఖ సింగర్ మృతి
  • దుర్గాపూజలో పాటలు పాడిన సింగర్ మురళీ మహాపాత్ర
  • నాలుగో పాట పాడి ఐదో పాటకు సిద్దమవుతూ అనంతలోకాలకు
Murali Mohapatra Death Reason: పాటలు పాడుతూనే ప్రముఖ సింగర్ మృతి.. ఏమైందంటే?

Odia Singer Murli Mohapatra Dies Due To Heart Attack While Singing On Stage: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి, ఇప్పటికే తెలుగు సహా పలు భాషలకు చెందిన నటీనటులు ఇతర టెక్నీషియన్లు మృతి చెందారు. తాజాగా ఒడిశా సింగర్ మురళీ మహపాత్ర కన్నుమూశారు. ఒక వేదికపై పాటలు పాడుతూనే గాయకుడు మురళీ మహపాత్ర కన్నుమూశారు. దుర్గా పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన 4 పాటలు పాడి హఠాత్తుగా మరణించారు. వెంటనే మురళీ మహపాత్రను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మురళీ మహపాత్ర మృతితో అభిమానుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిజానికి కొన్నాళ్ల క్రితం సింగర్ కెకె కూడా వేదికపై ప్రదర్శన ఇస్తున్నప్పుడు మరణించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.  అప్పట్లో వేదికపై పాటలు పాడుతూనే కేకే కుప్పకూలడం అభిమానులను చాలా కలవరపెట్టింది. ఆ సమయంలో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు, కానీ తరువాత ఆయన కన్నుమూశారు. కేకే లాగే మురళి హఠాన్మరణం చెందారు. ప్రముఖ గాయకుడు మురళీ మహపాత్రకు ఒడిశాలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

తాజాగా మురళీ మహపాత్ర కోరాపుట్‌లోని దుర్గాపూజలో పాటలు పాడుతూ ఉండగా వేదికపై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక మురళి మృతి అభిమానులకు పెద్ద షాక్ ను కలిగించింది. దుర్గా పూజ మొదలైన తరువాత మోహపాత్ర నాలుగు పాటలు పాడారని , ఆ తర్వాత... మురళీ మహపాత్ర ఆరోగ్యం బాగాలేదని ఆగిపోయినట్టు చెబుతున్నారు. నిజానికి ఒడిశాలోని జైపూర్ నగరంలో ఆయన ప్రదర్శనను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ ఈవెంట్‌లో నాలుగు పాటలు పాడిన ఆయన ఆ తర్వాత ఐదవ పాటను ప్రారంభించే ముందు ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోయారని అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. .మురళి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. గాయకుడిగానే కాకుండా జైపూర్‌లోని డిప్యూటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మురళి క్లర్క్‌గా కూడా పనిచేస్తున్నాడని చాలా కొద్దిమందికే  తెలుసు. ఇక మురళి అన్నయ్య విభూతి ప్రసాద్ మహాపాత్ర చెబుతున్న దాని ప్రకారం ఆయన చాలా కాలంగా గుండె జబ్బు మరియు మధుమేహంతో బాధపడుతున్నారట.

మురళీ మహపాత్ర మృతి పట్ల  ఒడిశా ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.'గాయత్ మురళి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా' అని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఆయన మధురమైన గాత్రం శ్రోతల హృదయాల్లో ఎప్పుడూ మారుమ్రోగుతూనే ఉంటుందని, ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అంటూ పేర్కొన్న ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read: Paid Bots Star Allu Arjun: పైడ్ బాట్స్ స్టార్ అల్లు అర్జున్ అంటూ ట్రోలింగ్.. ఆదిపురుష్ దెబ్బకేనా?

Also Read: Nagarjuna on Ponniyin Selvan 1: వాళ్ల మాటలు వినొద్దు.. పొన్నియన్ సెల్వన్-బాహుబలి కంపేరిజన్ పై నాగ్ ఆసక్తికర కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News