Actress Soujanya Suicide: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం... నటి సౌజన్య ఆత్మహత్య

జూనియర్ ఆర్టిస్ట్ కావలి అనురాధ ఆత్మహత్య మరవక ముందే కన్నడ నటి సౌజన్య తన అపార్ట్మెంట్ లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 04:57 PM IST
  • సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
  • కన్నడ నటి సౌజన్య ఆత్మహత్య
  • మరణానికి ఎవరు కారణం కాదని నోట్ రాసిన నటి
Actress Soujanya Suicide: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం... నటి సౌజన్య ఆత్మహత్య

Actress Soujanya Suicide: ఈ రోజు ఉదయం  హైదరాబాద్ ఫిల్మ్ నగర్ (Hyderabad Film Nagar)లో జూనియర్ ఆర్టిస్ట్ కావలి అనురాధ  (Junior Artist Kavali Anuradha) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిదిందే. ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేసాడని రెంట్ కు ఉంటున్న రూమ్ లో బలవర్మరణం వార్త జీరించుకోక ముందే మరో నటి తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది.

సినీ ఇండస్ట్రీలో ఒకదాని తరువాత మరో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నడ టీవీ నటి సౌజన్య తన అపార్ట్మెంట్ లో ఆత్మ హత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటి సౌజన్య బెంగుళూరులోని (Bengaluru) కుంబల్‌గోడులో (Kumbalgodu) తన అపార్ట్‌మెంట్ లో ఉరి వేసుకుని చనిపోయింది. ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం డోర్ పగలగొట్టిన తరువాత రూమ్ లో ఉరివేసుకున్న ఆమెను చూసి పోలీసులు నివ్వెరపోయారు. ఆమె కాలిపై  పచ్చబొట్టు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Also Read: Scary Video: చేతి కర్రతో చిరుతతో పోరాటం.. ప్రాణాలు కాపాడుకున్న వృద్దురాలు

ప్రాథమిక దర్యాప్తులో ఆమె మరణానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, ఇంత కఠినమైన నిర్ణయానికి వెనుక ఏవైనా కారణాలు ఉండొచ్చు అన్న కోణంలో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను, సహా ఉద్యోగులను విచారణ జరుపుతున్నారు. ఆమె రాసి పెట్టిన మరణ వాంగ్మూలాన్ని (Suicide note) కూడా పోలీసులు కనుగొన్నారు. 

ఆమె రాసిన పెట్టిన మరణ వాంగ్మూలంలో " నా  కఠిన నిర్ణయానికి దోషులు ఎవరు లేరని, నా చావుకు ఎవరు కారణం కాదని... నా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు మానసికంగా భాదపడుతున్నానని, అమ్మ-నాన్న నన్ను క్షమించండి" అని పేర్కొంది. అంతేకాకుండా, తనకు అన్ని విషయంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు తెలుపుతున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొంది. 

నటి సౌజన్య కొన్ని టీవీ సీరియల్స్ మరియు సినిమాలలో నటించింది. నటి ఆత్మహత్య చేసుకునేంత ఇబ్బందులు ఏమిటో తెలుసుకోటానికి ఆమెతో పనిచేసిన వారందరిని పోలీసులు విచారిస్తున్నారు. నటి సౌజన్య మృతితో టీవీ ఇండస్ట్రీతో పాటు , సినిమా ఇండస్ట్రీ కూడా షాక్ కు గురైంది. 

Also Read: Naga Chaitanya: Love Story మూవీ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయ్‌ ‌‌- నాగచైతన్య

ఉదయం వెలుగులోకి వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ కావలి అనురాధ ఆత్మహత్య (Junior Artist Kavali Anuradha), అది మరవక ముందే కన్నడ టీవీ నటి సౌజన్య మరణంతో (Kannada Actress Soujanya Suicide) సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News