RRR Movie Release: ఒమిక్రాన్ భయం, ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడుతుందా..? లేదా..?

RRR Movie Release: ప్రపంచమంతా వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్..పాన్ ఇండియా మూవీ RRR పై ప్రభావం చూపిస్తుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. అయితే రాజమౌళి సినిమా విడుదలపై స్పష్టత ఇచ్చాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 29, 2021, 04:16 PM IST
RRR Movie Release: ఒమిక్రాన్ భయం, ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడుతుందా..? లేదా..?

RRR Movie Release: ప్రపంచమంతా వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్..పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్‌పై ప్రభావం చూపిస్తుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది . అయితే ఈ ఆందోళనకు తెరదించాడు దర్శకుడు రాజమౌళి. సినిమా విడుదలపై స్పష్టత ఇచ్చాడు.

దేశంలో అందరికీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం పట్టుకుంది. ముఖ్యంగా కొత్తగా విడుదల కానున్న సినిమాలపై ఆ ప్రభావం స్పష్టంగా పడుతుందనే ఆందోళన నెలకొంది. పాన్ ఇండియా సినిమాలపై కచ్చితంగా ఒమిక్రాన్ దెబ్బ పడుతుందనే వార్తలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాపై పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఒమిక్రాన్ కేసుల సంక్రమణ పెరుగుతున్న నేపద్యంలో ఢిల్లీలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ అయింది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూ అమలవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలున్నాయి. 

ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) వాయిదా పడుతుందనే ఊహాగానాలు అధికమవుతున్నాయి. ఇప్పుడీ ఊహాగానాలకు ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి తెరదించారు. సినిమా వాయిదా పడే సమస్యే లేదని స్పష్టం చేశాడు. జనవరి 7న కచ్చితంగా విడుదలవుతుందని తనతో చెప్పినట్టు ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. స్వయంగా రాజమౌళి (Rajamoui) చెప్పినట్టుగా ప్రకటించడంతో ఊహాగానాలకు తెరపడినట్టేనని తెలుస్తోంది. 

Also read: Samantha and Allu Arjun: సమం‌త, అల్లు అర్జున్‌ల మధ్య ఒకరిపై మరొకరికి అంత నమ్మకమా..? ఎందుకు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News