OTT Movies: అన్ని భాషల్లో వివిధ రకాల కంటెంట్ అందుబాటులో ఉండటంతో పాటు నచ్చినప్పుడు నచ్చిన విధంగా నచ్చిన కంటెంట్ నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే ప్రతి సినిమా ఓటీటీ విడుదల తేదీ కూడా ముందే నిర్ధారణ అవుతోంది. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ వారం ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలు విడుదల కానున్నాయి. బాక్సాఫీసులో ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని నమోదు చేయనున్నాయనేది ఆసక్తిగా మారింది. సలార్‌పై మాత్రం భారీ అంచనాలున్నాయి. మరోవైపు ఓటీటీలో కూడా ఈవారం ఏకంగా 30 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం ఏ సినిమా లేదా వెబ్‌సిరీస్ ఎందులో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో పరిశీలిద్దాం..
నెట్‌ఫ్లిక్స్‌లో..
డిసెంబర్ 18న హలో ఘోస్ట్ మాండరిన్ సినిమా, ద రోప్ కర్స్ 3 సినిమాలు, డిసెంబర్ 20న సిండీ లా రెజీనా-ద హైస్కూల్ ఇయర్స్ స్పానిష్ వెబ్‌సిరీస్, మ్యాస్ట్రో సినిమా, ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 సినిమా విడుదల కానున్నాయి. ఇక డిసెంబర్ 21న అల్హమర్ అరబిక్ సినిమా, లైక్ ఫ్లవర్స్ ఇన్ సౌండ్ కొరియన్ వెబ్‌సిరీస్, రెబెల్ మూన్ పార్ట్ 1 సినిమా, డిసెంబర్ 22వ తేదీన ఆదికేశవ తెలుగు సినిమా, కర్రీ అండ్ సైనైడ్ హిందీ వెబ్‌సిరీస్, యోంగ్ సాంగ్ క్రియేచర్ కొరియన్ వెబ్‌సిరీస్, కుయికో తమిళ సినిమా, డిసెంబర్ 24వ తేదీన ఎ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ సినిమా, పింక్ ఫాంగ్ సింగ్ సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..
డిసెంబర్ 18న ఫలిమి తెలుగు డబ్ సినిమా, బీటీఎస్ మాన్యుమెంట్స్ కొరియన్ వెబ్ సిరీస్, డ్రాగన్ ఆఫ్ వాండర్స్ హ్యాచ్ జపాన్ వెబ్ సిరీస్, పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ వెబ్ సిరీస్, డిసెంబర్ 22వ తేదీన వాట్ ఆఫ్ సీజన్ 2 వెబ్ సిరీస్ విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్‌లో..
డిసెంబర్ 19న మిషన్ స్టార్ట్ ఏబీ వెబ్ సిరీస్, డిసెంబర్ 21వ తేదీన ది ఏసెస్ సినిమా, డిసెంబర్ 22వతేదీన డ్రై డే సినిమా, సాల్ట్ బర్న్ సినిమా, సప్త సాగరాలు తెలుగు డబ్ సినిమా విడుదల కానున్నాయి.
జీ5లో...
డిసెంబర్ 22వ తేదీన ఆడి మలయాళం సినిమా, హోమోరస్లీ యువర్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
జియో సినిమాలో..
డిసెంబర్ 21న బార్బీ ఇంగ్లీషు సినిమాతో పాటు హే కమినీ హిందీ సినిమా విడుదలవుతున్నాయి.
Also read: Tollywood Directors: రొటీన్ కథలతో సీనియర్లు.. ఇక రూట్ మార్చాల్సిందేనా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook