New OTT Releases This Week in Telugu: ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు పలు ఆసక్తికరమైన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఇప్పటికే తెలుగులో విడుదలైనవి ఓటీటీలో రిలీజ్ అవుతుండగా ఒకటి రెండు సినిమాలు మాత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే మరికొన్ని వెబ్ సిరీస్ లు సైతం రిలీజ్ అవుతున్నాయి.
ఐదో తారీకు అంటే శుక్రవారం నాడు ఎన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి? ఎన్ని వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి? అవన్నీ ఎందులో అందుబాటులో ఉన్నాయనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సన్ నెక్స్ట్ ఓటీటీలో నాగశౌర్య హీరోగా నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్ అయింది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈ సినిమా ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం హీరోగా మీటర్ అనే సినిమా తెరకెక్కింది.
Also Read: Rama Banam Movie Review: గోపీ చంద్ 'రామబాణం' రివ్యూ-రేటింగ్.. లక్ష్యాన్ని చేధించిందా?
కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఆ సినిమా కూడా ఈ రోజే రిలీజ్ అయింది. ఇక అదే విధంగా 1999లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు డిజిటల్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తోంది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా, ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమా, నారా రోహిత్ హీరోగా నటించిన రౌడీ ఫెలో సినిమా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన అమృతం చందమామలో అనే సినిమా నెట్ఫ్లిక్స్ లో విడుదల అయ్యాయి.
అదే విధంగా ఇంగ్లీష్ భాషలో ది ఎమోజి మూవీ సినిమా రిలీజ్ అవుతూ ఉండగా తూ ఝూట్ మై మచ్చర్ అనే హిందీ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అదే విధంగా హాట్ స్టార్ లో సాస్ బహు ఔర్ ఫ్లెమింగో అనే ఒక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మలయాళం సినిమా కరోనా పేపర్స్ కూడా హాట్ స్టార్ లో స్టీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ యాప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ సినిమా రిలీజ్ అవుతూ ఉండగా జీ 5 ఆప్ లో శభాష్ ఫెలోడా అనే బెంగాలీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది, అలాగే ఫైర్ ఫ్లైస్ పార్ధ్ ఔర్ జిగ్ను అనే హిందీ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఆహా వీడియోలో గీత సుబ్రహ్మణ్యం సీజన్ 3 స్ట్రీమింగ్ అవుతుండగా అదే ఆహా తమిళ్ యాప్ లో రిపీట్ అనే తమిళ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: Ugram Movie Review: 'ఉగ్రం' రివ్యూ అండ్ రేటింగ్.. అదరగొట్టిన అల్లరోడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook