Ugram Movie Review: 'ఉగ్రం' రివ్యూ అండ్ రేటింగ్.. అదరగొట్టిన అల్లరోడు!

Ugram Movie Review and Rating: ఉగ్రం టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమాతో వస్తున్నానని అంచనాలు రేకెత్తించిన అల్లరి నరేష్ శుక్రవారం నాడు బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.  

Written by - Chaganti Bhargav | Last Updated : May 5, 2023, 04:42 PM IST
Ugram Movie Review: 'ఉగ్రం' రివ్యూ అండ్ రేటింగ్.. అదరగొట్టిన అల్లరోడు!

Allari Naresh Ugram Movie Review: ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ నాంది సినిమాతో సీరియస్ హీరోగా మారాడు. ఆ సినిమాతో తనను తాను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకున్న నరేష్ ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఇక అదే స్టైల్ ని కొనసాగిస్తూ ఇప్పుడు ఉగ్రం అనే సినిమా చేశాడు. టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమాతో వస్తున్నానని అంచనాలు రేకెత్తించిన ఆయన శుక్రవారం నాడు బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఉగ్రం:
కథ విషయానికొస్తే సీఐ శివకుమార్( అల్లరి నరేష్) చాలా నిజాయితీ గల పోలీస్ అధికారి. తాను డ్యూటీలో ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకోవాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి శివకుమార్ అనుకోకుండా యాక్సిడెంట్ బారిన పడతాడు. అతనితోనే ప్రయాణిస్తున్న తన భార్య(మిర్న), కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో వారిని హాస్పిటల్లో చేరుస్తాడు. అయితే హాస్పిటల్లో శివకుమార్ రెస్ట్ తీసుకుని నిద్రలేచిన తర్వాత తన భార్యను, పాపను అసలు హాస్పిటల్కే తీసుకురాలేదని తెలుసుకుంటాడు. అయితే శివకుమార్ అలా వారిని తీసుకువచ్చానని ఒక వ్యాధి కారణంగా భ్రమ పడతాడు. ఈ విషయం డాక్టర్ల ద్వారా తెలుసుకున్నా సరే నిజంగానే తన కుమార్తె, భార్య మిస్ అయ్యారు అనే విషయాన్ని అందరికీ అర్థం అయ్యేలా చెబుతాడు. అయితే శివకుమార్ భార్య, కుమార్తె ఎలా మిస్ అయ్యారు? సిటీలో మిస్ అవుతున్న వందలాది మంది సామాన్య జనానికి, శివకుమార్ భార్య, కుమార్తె మిస్సింగ్ కి కనెక్షన్ ఏమిటి? సీఐ శివకుమార్ ఈ మిస్సింగ్ కేసులను సాల్వ్ చేశాడా? తన భార్య, కూతుర్ని సేవ్ చేశాడా? అనేది సినిమా కథ.

Also Read: Ramabanam : రామబాణం థియేటర్ కౌంట్.. బ్రేక్ ఈవెన్ ఎంత, బిజినెస్ ఎంత జరిగిందంటే?

విశ్లేషణ:
సాధారణంగానే మిస్సింగ్ పర్సన్స్ ని వెతికే థ్రిల్లర్ సినిమాలు మనం చాలా చూశాం. కానీ ఒక పోలీసు అధికారి కుటుంబమే మిస్ అయితే, అది కూడా పోలీసు అధికారి మీద పిచ్చోడు అని ముద్రపడితే అతని పరిస్థితి ఏమిటి? అతని భార్య, పాపను కాపాడుకోవడం కోసం పోలీసు వ్యవస్థ అంతా ఎలా ఒకటైంది? అనే విషయాలను ఈ ఉగ్రం అనే సినిమా ద్వారా చూపించారు. ఒకప్పుడు కామెడీ సినిమాలకు మాత్రమే పరిమితమైన అల్లరి నరేష్ నాంది సినిమా నుంచి తన స్టైల్ మార్చుకున్నాడు. నటనలో ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఈ ఉగ్రం సినిమాతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా కథ కొత్తగా అనిపించకపోయినా అల్లరి నరేష్ తనదైన నటనతో స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేశాడు. సినిమా చూస్తున్నంత సేపు అల్లరి నరేష్ నటన, ఆయన డామినేషన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కథను స్క్రీన్ ప్లే ను దర్శకుడు చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేశాడు. ముందు శివకుమార్ భార్య, పాప మిస్ అవ్వడం, తర్వాత వారు ఎలా మిస్ అయ్యారని తెలుసుకునే ప్రయత్నం చేయడం వారిని కాపాడే క్రమంలో వందలాదిమంది అభాగ్యులను శివకుమార్ ఎలా కాపాడాడు? అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కించారు. పెద్దగా కామెడీ కనిపించకపోయినా ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే విధంగా సాగింది.

నటీనటులు : 
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో అల్లరి నరేష్ అంతా తన భుజస్కంధాల మీద నడిపించాడు. ఈ సినిమా కథ మొత్తం శివకుమార్ చుట్టూనే తిరుగుతుంది. సిఐ శివకుమార్ గా అల్లరి నరేష్ నటనలో మరో మైలురాయిని చేరుకున్నాడని చెప్పాలి. అల్లరి నరేష్ ని ఒకప్పుడు చూస్తే కామెడీ హీరో అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఉగ్రం సినిమా చూస్తున్నంత సేపు ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసిన నరేష్ ఇతనేనా అంటే నమ్మే విధంగా కూడా లేదు. అంతలా తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు నరేష్. ఇక అల్లరి నరేష్ భార్య పాత్ర పోషించిన మిర్న మీనన్ ది చిన్న పాత్ర అయినా తనదైన శైలిలో నటించింది. ఇక డాక్టర్ పాత్రలో ఇంద్రజ, ఎస్సై పాత్రలో శత్రు, కానిస్టేబుల్ పాత్రలో రమేష్ రెడ్డి వంటి వారు ఆకట్టుకునేలా నటించారు. చిన్నారి ఊహారెడ్డి తనదైన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

టెక్నికల్ టీం: 
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు విజయ్ కనకమేడల రాసుకున్న కథ గతంలో మనం చూసిన లేదా వార్తల్లో చూసిన కథలాగానే అనిపించినా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. సినిమా ఓపెనింగ్ కాస్త స్లో అనిపించినా కథలోకి వెళ్లే కొద్దీ ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేశాడు. కథలో వచ్చే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉంటాయి. ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. పాటలు అంత ఆకట్టుకోకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్లాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా నిర్మాణ సంస్థ స్థాయికి తగ్గట్టే అదిరిపోయాయి. 

ఫైనల్ గా:
ఒక్క మాటలో చెప్పాలంటే అల్లరి నరేష్ ఇకపై ‘ఉగ్రం’ నరేష్
Rating: 2.75/ 5 

Also Read: Ugram Movie: అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. లాభం రావాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో తెలుసా?

 

Trending News