భారత్‌లో కుక్క చావు చచ్చిన టెర్రరిస్ట్, పాక్‌లో హీరో ?

భారత్ పట్ల పాకిస్థాన్ మాత్రమే కాకుండా అక్కడి ఫిలింమేకర్స్ కూడా తమ వక్ర బుద్ధిని చూపించుకుంటున్నారు.

Last Updated : Jan 1, 2018, 07:12 PM IST
భారత్‌లో కుక్క చావు చచ్చిన టెర్రరిస్ట్, పాక్‌లో హీరో ?

భారత్ పట్ల పాకిస్థాన్ మాత్రమే కాకుండా అక్కడి ఫిలింమేకర్స్ కూడా తమ వక్ర బుద్ధిని చూపించుకుంటున్నారు. భూతల స్వర్గమైన కాశ్మీర్‌లో స్థానిక యువతని జిహాద్ పేరిట రెచ్చగెట్టి భారత్‌పైకే యుద్ధానికి ఉసిగొల్పుతున్న పాకిస్థాన్... కాశ్మీర్ గడ్డపై చనిపోయిన తీవ్రవాదులని తమ స్వాతంత్ర్య సమరయోధులుగా చూపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. 2016లో జులై 8న భారత సైనికుల చేతిలో కుక్క చావు చచ్చిన బురాన్ వనిని కాశ్మీర్ ముద్దు బిడ్డగా అభివర్ణిస్తూ తాజాగా పాకిస్థాన్‌కి చెందిన రానా అబ్రార్ అనే ఫిలింమేకర్ ఓ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించాడు. 

'బురాన్: ది సన్ ఆఫ్ కాశ్మీర్' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ యానిమేషన్ చిత్రం టీజర్‌ని జనవరి 1 సందర్భంగా ఇటీవలే విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. భారత్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో వుండి, భారత సైనికుల చేతిలో మృతిచెందిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బురాన్ వనిని పాకిస్థాన్ తమ వీరుడిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందనడానికి ఇంతకన్నా మరో నిదర్శనం అవసరం లేదు. 

బురాన్ వని చనిపోయినప్పుడు అతడి అంత్యక్రియల సందర్భంగానూ కాశ్మీర్ లోయలో అశాంతిని రేపే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ ఇప్పుడిలా అతడి చావుని కూడా వాడుకిని కాశ్మీర్ యువతని రెచ్చగొడుతోంది. ముజాహిదీన్ ఫైటర్స్ తీవ్రవాదులు కాదని, తమ గడ్డపై పుట్టిన వారికి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న యోధులని ఆ టీజర్‌లో చూపించాడు ఫిలింమేకర్ రానా అబ్రార్. 

Trending News