Panchatantram Movie Response : ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకంటే.. కంటెంట్ బేస్డ్ చిత్రాలే ఆడుతున్నాయాయి. కొత్త కథలు, మేకింగ్‌లను జనాలు ఇష్టపడుతున్నాడు. మాస్ మసాలా అంటూ వచ్చే చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. కొత్త కథలు, ఎమోషనల్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పంచతంత్రం అనే సినిమా వచ్చింది. ఇందులో ఐదు కథలను చూపించారు. ప్రతీ ఒక్క కథలో అంతర్లీనంగా సందేశాలను అందించారు.
మామూలుగా అయితే కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్ నుంచి బయటకు వెళ్లే ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయి. సినిమా అయిపోయినా కూడా ఆ కథలు, ఆ పాత్రలతో ప్రయాణం అవుతుంటారు. అలా ఆడియెన్స్‌ను ప్రభావితం చేసే అతి కొద్ది సినిమాల్లో పంచతంత్రం కూడా చేరింది. నేడు విడుదలైన ఈ మూవీకి ఇప్పుడు మంచి రెస్పాన్స్ దక్కింది.
Exactly 💯 4th story strt ninchi climax Varaku...I couldn't stop crying n felt veryy emotional❤️
Kudos to #Panchathantram team🙌Soo glad dat I had an amazing theatrical experience today 🥺🙏🏽 https://t.co/WR0oGahyYh
— మిస్సమ్మ (@holaaamigoo) December 9, 2022
తాజాగా కొన్ని వీడియోలు నెట్టింట్లో షేర్ అవుతున్నాయి. థియేటర్లో సినిమాను చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టేసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్ మరింత ఎమోషనల్‌గా ఉందని, నాలుగో స్టోరీ నుంచి క్లైమాక్స్ వరకు అద్భుతంగా ఉందని, ఇలాంటి అనుభూతిని కలిగించిన పంచతంత్రం టీంకు థాంక్స్ అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.
ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి డిమాండ్ ఉంటుందని, ఇలాంటి ఆంథాలజీ స్టోరీలు అక్కడ మరింతగా వర్కౌట్ అవుతాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి థియేటర్లో సక్సెస్ అయిన ఈ పంచతంత్రం.. ఇక మున్ముందు రోజుల్లో ఓటీటీలోనూ దుమ్ములేపనుందన్నమాట.
Also Read : Adivi Sesh : కుక్క కంటే తక్కువ స్క్రీన్ స్పేప్.. ఇది నా శాపం.. అడివి శేష్‌పై నెటిజన్ కామెంట్
Also Read : RJ Surya and Aarohi : కష్టం, సుఖం పంచుకుంటాం.. సూర్యపై ఆరోహి కామెంట్స్.. బిగ్ బాస్ అనంతరం ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook