Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!

Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ (వైయస్ఆర్సీపీ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొదటి భార్య గురించి అందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 16, 2024, 08:16 AM IST
Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు?  ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!

Pawan Kalyan 1st Wife: పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేనానిగారు అందరు పిలిచేవారు. ఇకపై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా అందరు పవన్ కళ్యాణ్  గురించి మాట్లాడుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ ఎలక్షన్స్ లో కూటమిగా 164 సీట్లతో దుమ్ము దులిపింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డులకు ఎక్కింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావడంలో కీ రోల్ పోషించి అసలు సిసలు గేమ్ ఛేంచర్ గా నిలిచారు  అంతేకాదు తాజాగా ఏపీలో ఏర్పడిన చంద్రబాబు నాయుడు మంత్రవర్గంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. అంతేకాదు ఆయనకు పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ , సైన్స్  అండ్ టెక్నాలజీ శాఖలను అప్పగించారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ మంత్రిగా, పార్టీ అధినేతగా రెండు పడవలపై ప్రయాణం చేయాలి. అంతేకాదు ఇంతకు ముందులా సినిమాలు చేస్తారా అనేది కూడా డౌటే. ఆ సంగతి పక్కన పెడితే..ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మూడు పెళ్లిళ్ల గురించి పదే పదే ప్రస్తావించినా.. ప్రజలు అవేమి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో  పవన్ కళ్యాణ్ మొదటి భార్య గురించి అందరు చర్చించుకుంటున్నారు. అందరికీ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ తో పాటు మూడో భార్య అన్నా లెజినోవా ల గురించే తెలుసు. కానీ ఫస్ట్ వైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

అసలు పవన్ కళ్యాణ్ మొదటి భార్య ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత యేడాది 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.  ఆ తర్వాత 2007లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే వీరికి ఒక అబ్బాయి అకిరానందన్ ఉన్నాడు. ఆ తర్వాత రెండో భార్య రేణుకు విడాకులు ఇచ్చిన రష్యన్ యువతి అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

ఇక పవన్ కళ్యాణ్ విశాఖ పట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయారు. నందిని కూడా ఎపుడు మీడియాకు ఎక్కి రచ్చ చేసింది లేదు.  ఆ తర్వాత నందిని తన పేరును జాహ్నవిగా పేరు మార్చుకున్నట్టు సమాచారం. అంతేకాదు 2010లో ఈమె డాక్టర్ కృష్ణారెడ్డిని రెండో వివాహాం చేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈమె అమెరికాలో సెటిల్ అయినట్టు సమాచారం. అంతేకాదు వీళ్లిద్దరికి దాదాపు రూ. 200 కోట్ల వరకు ఆస్తులున్నట్టు సమాచారం.  ప్రస్తుతం ఈమె తన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తోంది. ఇక రేణు దేశాయ్.. ప్రస్తుతం పూణెలో ఉంటుంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News