Pawan Kalyan b'day gift: పవన్ కల్యాణ్‌కి హీరోయిన్ బర్త్ డే గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ( Pawan Kalyan birthday ) సందర్భంగా ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ అభిమానులతో పాటు టాలీవుడ్ నటీనటులు, ఇతర సెలబ్రిటీలు తమకు తోచిన రీతిలో పవన్ కల్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Last Updated : Sep 3, 2020, 01:21 AM IST
Pawan Kalyan b'day gift: పవన్ కల్యాణ్‌కి హీరోయిన్ బర్త్ డే గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ( Pawan Kalyan birthday ) సందర్భంగా ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ అభిమానులతో పాటు టాలీవుడ్ నటీనటులు, ఇతర సెలబ్రిటీలు తమకు తోచిన రీతిలో పవన్ కల్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా Rx100 మూవీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ( Actress Payal Rajput ) సైతం ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని తనదైన స్టైల్లో చాటుకుంది. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ( Green India challenge ) స్ఫూర్తితో మూడు మొక్కలు నాటిన పాయల్.. ఈ కార్యక్రమాన్ని ఇదే రోజున ( సెప్టెంబర్ 2 ) పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌కు ( Pawan Kalyan ) అంకితం ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. Also read : Adipurush villain: విలన్ పాత్రపై ప్రభాస్ ఇచ్చిన అప్‌డేట్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్ఫూర్తితో మూడు మొక్కలు నాటాను అని ట్వీట్ చేసిన పాయల్.. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ( Pragya Jaiswal ), రవితేజ ( Raviteja ), కరణ్ శర్మ ( Karan Sharma ), సౌరభ్‌ ధింగ్రా ( Sourabh Dhingra )లను మరో మూడు మొక్కలు నాటాల్సిందిగా నామినేట్ చేస్తున్నాను అని ఆ ట్వీట్‌లో పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌‌కి పాయల్ రాజ్‌పుత్ ధన్యవాదాలు తెలియజేసింది. Also read : Pawan Kalyan: పవన్ 28 మూవీ.. క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

Trending News