Pawan Kalyan Remuneration : గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయంలో గొడవలా?.. అనుకున్నంత ఇవ్వలేదన్న పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. యాభై కోట్లు తీసుకుంటున్నాడని, రోజుకు రెండు కోట్ల చొప్పున పుచ్చుకుంటున్నాడనే టాక్ వస్తూనే ఉంటుంది. అయితే గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడని టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 07:27 AM IST
  • ఆహాలో పవన్ కళ్యాణ్‌ సందడి
  • రెమ్యూనరేషన్ విషయంలో కామెంట్
  • అనుకున్నంత ఇవ్వలేదన్న పవర్ స్టార్
Pawan Kalyan Remuneration : గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయంలో గొడవలా?.. అనుకున్నంత ఇవ్వలేదన్న పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Remuneration పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే అవుతుంటుంది. వకీల్ సాబ్ గురించి ఇరవై ఐదు రోజులు కేటాయించాడని, రోజుకు రెండు కోట్ల చొప్పున యాభై కోట్లు పుచ్చుకున్నాడని టాక్ వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్ యాభై కోట్లు ఉంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ ఇరవై కోట్లు అని అన్నట్టుగా కనిపిస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది.

తాజాగా పవన్ కళ్యాణ్‌ తన రెమ్యూనరేషన్ మీద నోరు విప్పాడు. ఎంత అనే ఫిగర్ అయితే బయటకు చెప్పలేదు. పవన్ కళ్యాణ్‌ తన తొలి ప్రేమ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదట. బడ్జెట్ ఎక్కువగా అవ్వడంతో నిర్మాతలు తరువాత ఇస్తామని అన్నారట. తొలి ప్రేమ వంద రోజుల ఫంక్షన్ తరువాత ఎప్పుడో కొంత ఇచ్చారట. ఆ విషయాన్ని తాజాగా బాలయ్య షోలో పవన్ కళ్యాణ్‌ పంచుకున్నాడు.

అయితే కనీసం గబ్బర్ సింగ్‌కు అయినా ఇచ్చారా? అని పవన్ కళ్యాణ్‌ను బాలయ్య అడిగేశాడు. హా ఇచ్చాడు.. కానీ తను అనుకున్నంత ఇచ్చాడు.. నేను అనుకున్నంతగా కాదు అని బాంబ్ పేల్చాడు పవన్ కళ్యాణ్‌. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ బండ్లన్నను నిలదీస్తున్నారు.

 

పవన్ కళ్యాణ్‌కు, నీకు రెమ్యూనరేషన్ విషయంలో గొడవలా? తక్కువ ఇచ్చావా? అంటూ నెటిజన్లు బండ్లన్నను ట్విట్టర్‌లో అడిగేస్తున్నారు. దీనికి బండ్లన్న ఇచ్చిన రిప్లై అదిరిపోయింది. భగవంతుడు అడగడు.. భక్తుడు ఇస్తాడు.. బాగుందా తమ్ముడు ఈ కౌంటర్ అన్నట్టుగా బండ్లన్న రిప్లై ఇచ్చాడు. మొత్తానికి మరోసారి గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News