నితిన్ సినిమా పండుగకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ !

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్న పవర్ స్టార్‌ని మళ్లీ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎప్పుడు చూస్తామా అని ఆశపడే అతడి అభిమానులకు ఇది ఓ గుడ్ న్యూస్.

Last Updated : Mar 23, 2018, 07:41 PM IST
నితిన్ సినిమా పండుగకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఇక సినిమాలవైపు తిరిగి చూసే సందర్భం రాలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్న పవర్ స్టార్‌ని మళ్లీ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎప్పుడు చూస్తామా అని ఆశపడే అతడి అభిమానులకు ఇది ఓ గుడ్ న్యూస్. అవును, పవన్ కల్యాణ్ మరో రెండు రోజుల్లో తన అభిమానుల ముందుకు రానున్నారు. తనని అమితంగా అభిమానించే నితిన్ హీరోగా రూపొందిన 'చల్ మోహన రంగ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జనసేనాని చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నారు. మార్చి 25న జరగనున్న ఈ సినిమా ఫంక్షన్‌లో ఒకే వేదికపై పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, నితిన్ సందడి చేయనున్నారు.

 

నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రౌడీ ఫెలో సినిమాను డైరెక్ట్ చేసిన కృష్ణ చైతన్య అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించిన చలో మహన రంగ సినిమాను స్వయంగా పవన్ కల్యాణ్ తన సొంత బ్యానర్ అయిన పీకే క్రియేటివ్ వర్క్స్‌పై నిర్మించడం ఈ సినిమాకు వున్న ఓ ప్రత్యేకత కాగా.. పవన్ సన్నిహిత మిత్రుడిగా పేరున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందించడంతోపాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం మరో విశేషం. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో 'లై' ఫేమ్ మేఘా ఆకాష్ నితిన్ సరసన జంటగా నటించింది. పవన్ ఫ్యాన్స్‌కి బోలెడన్ని ప్రత్యేకతలు వున్న ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్‌లోకి రానుంది.

 

Trending News