Pooja Hegde: స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే.. ఇక హిట్టు ఖాయమేనా!

Pooja Hegde to act with Suriya in Tamil Movie. మాస్ డైరెక్ట‌ర్ శివతో సూర్య ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే నటించ‌నుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 7, 2022, 08:32 PM IST
  • స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే
  • ఇక హిట్టు ఖాయమేనా
  • క‌థ న‌చ్చ‌డంతో
Pooja Hegde: స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే.. ఇక హిట్టు ఖాయమేనా!

Pooja Hegde to pair up with Tamil Hero Suriya in her next: తమిళ స్టార్ హీరో సూర్యకు ఇటీవల కాలంలో ఒక్క క‌మ‌ర్షియ‌ల్‌ హిట్టు లేదు. ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అవి ఓటీటీలోనే విడుద‌ల‌య్యాయి. సరైన హిట్ కోసం ప్రస్తుతం విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు బాలా ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ఓ సినిమాను చేస్తున్నాడు. శివపుత్రుడు సినిమా అనంతరం దాదాపు 19 ఏళ్ల త‌ర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా తెర‌కెక్కుతుంది. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది.

బాలా సినిమా త‌ర్వాత మాస్ డైరెక్ట‌ర్ శివతో సూర్య ఓ సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఐఐటీ ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే నటించ‌నుంద‌ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్ప‌టికే మేక‌ర్స్ బుట్టబొమ్మను సంప్ర‌దించ‌గా.. క‌థ న‌చ్చ‌డంతో ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారట. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

సూర్య, శివ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్‌ సంగీతం అందించ‌నున్నాడ‌ని సమాచారం. మాస్ డైరెక్ట‌ర్ శివ ఇదివరకు శౌర్యం, శంఖం, వివేకం, పెద్ద‌న్న లాంటి సినిమాలు చేశాడు. ఇందులో శౌర్యం, వివేకం సినిమాలు భారీ హిట్ అయ్యాయి. చివరగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చేసిన పెద్ద‌న్న సినిమా ప్లాఫ్ అయింది. ప్రస్తుతం సూర్య, శివకు మంచి హిట్ అవసరం. మరి ఇద్దరు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి. 

Also Read:  iBOMMA Closed: సినీ ప్రియులకు చేదువార్త.. త్వరలోనే గుడ్ బై చెప్పనున్న 'ఐబొమ్మ'!

Also Read: Suchendra prasad: మైసూర్ ఘటన తర్వాత భర్తకు పవిత్ర లోకేష్ ఫోన్!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News