పూనమ్ కౌర్ ట్వీట్ పవన్ కళ్యాణ్ గురించి కాదు..!

గతంలో పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ... విమర్శకుడు కత్తి మహేష్‌‌ని కించపరిచేవిధంగా హీరోయిన్ పూనమ్ కౌర్ పెట్టిన ట్వీ్ట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Last Updated : Jan 29, 2018, 01:35 PM IST
పూనమ్ కౌర్ ట్వీట్ పవన్ కళ్యాణ్ గురించి కాదు..!

గతంలో పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ... విమర్శకుడు కత్తి మహేష్‌‌ని కించపరిచేవిధంగా హీరోయిన్ పూనమ్ కౌర్ పెట్టిన ట్వీ్ట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్ సెన్సేషనల్ అయ్యాక, పూనమ్ ట్విట్టర్ ఖాతాకి ఫాలోవర్లు కూడా బాగా పెరిగారు. ఈ క్రమంలో ఈ రోజు పూనమ్ కౌర్ చేసిన మరో ట్వీట్ దుమారం రేపింది. డ‌బ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.. మీ అస్తిత్వం ఏంటి? అవ‌స‌రాల కోసం మారిపోయిన నిజాయితీ.. నీ గుణం ఏంటి? అని పూనమ్ కౌర్ తెలుగులో చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ ట్వీట్ తమ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే అయ్యి ఉంటుందని ఆయన అభిమానులు పూనమ్ పై ట్విట్టర్‌లోనే మాటల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో ఆమె తన ట్వీట్ పై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తను చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ గురించి కాదని.. ధనసముపార్జన కోసం ఓ కన్నతండ్రి తన కుమార్తెను అమ్మిన వైనాన్ని వార్తల్లో చదివాక. అలాంటి వారి కోసమే ఈ ట్వీట్ చేయాల్సి వచ్చిందని ఆమె మళ్లీ ట్విట్టర్ ద్వారా తెలపడంతో పవన్ అభిమానులు శాంతించారు.

Trending News