Pawan Kalyan: రెండు పడవుల మీద ప్రయాణం.. పవన్ కళ్యాణ్ కి సాధ్యమేనా!

Pawan Kalyan OG: ఇప్పటిదాకా పవర్ స్టార్ గా ఫిలిం ఇండస్ట్రీలో.. ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పవన్.. ఇప్పుడు జనసేన అధినేతగా కూడా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. 21 నియోజకవర్గాల్లో 100% సక్సెస్ రేట్ తో.. దూసుకెళ్లిన పవన్ కళ్యాణ్.. అటు పాలిటిక్స్ మాత్రమే కాక..సినిమాల సంగతి కూడా చూడాల్సి ఉంది. మరి రెండు పడవల ప్రయాణాన్ని పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారో చూడాలి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 11, 2024, 09:30 AM IST
Pawan Kalyan: రెండు పడవుల మీద ప్రయాణం.. పవన్ కళ్యాణ్ కి సాధ్యమేనా!

OG Update: ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 21 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన.. అన్ని నియోజకవర్గాల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే.. రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్..పేరు మారు మ్రోగిపోతుంది. 

ఎన్నికలలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి పని.. వైరల్ గా మారింది. మోడీని కలవడం, చిరంజీవి ఇంటికి వెళ్లడం, ముఖేష్ అంబానీని కౌగిలించుకోవడం ఇలా సోషల్ మీడియాలో.. ఏ వైపు చూసినా పవన్ కళ్యాణ్ పేరు.. వినిపిస్తుంది. నార్త్ చానల్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్.. మామూలుగా లేదు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అనే పేరు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు.

అయితే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు పక్కన పెడితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా.. ఆయన చేతిలో బోలెడు పెండింగ్ సినిమాలు ఉన్నాయి. ఒకవైపు ఓజీ సినిమా.. షూటింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి.. సినిమాని విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టి.. సంవత్సరాలు గడిచిపోతుంది కానీ పూర్తవడం లేదు. 

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే.. కనీసం మొదలు కూడా అవ్వలేదు. ఇలా చాలా సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. అభిమానులలో కూడా పవన్ కళ్యాణ్ మళ్లీ ఎప్పుడు సినిమా షూటింగ్.. మొదలు పెడతారు అని సందేహాలు మొదలయ్యాయి. 

ముందు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలి కాబట్టి.. ఆ సినిమాలో తన పాత్ర కోసం పవన్ కళ్యాణ్ జుట్టు పెంచుతారని.. కొందరు చెబుతున్నారు. కొన్నాళ్లు ప్రసంగాలలో సైతం పవన్ కళ్యాణ్ ను అదే లుక్ లో చూడవలసిన అవసరం ఉంది. ఆ తరువాత ఓజీ కోసం.. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా తయారవ్వనున్నారట. 

మరోవైపు జనసేననిగా పిఠాపురం బాధ్యతలు మొత్తం పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకవైపు సినిమాల సంగతి చూసుకుంటూనే.. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ పనులను కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది రెండు పడవల మీద ప్రయాణం. అయితే అది అంత సులువైన విషయం కాదు. 

సినిమా హీరోల నుంచి డైరెక్టర్ల దాకా.. చాలామంది ఇలా రెండు పడవల ప్రయాణం చేయడానికి ప్రయత్నాలు చేశారు.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే.. విజయం సాధించారు. మరి పవన్ కళ్యాణ్ తన కెరియర్ ను ఎంత సమర్థవంతంగా.. డిజైన్ చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన పాయింట్ గా మారింది. పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం.. ఆయనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News