Prabhas Record: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాని ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఆ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. ఇక మొదటి షో నుంచి కలెక్షన్స్ సెన్సేషన్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది..
బాహుబలి తరువాత వరుస ఫ్లాపులతో సతమవుతమవుతున్న ప్రభాస్ కి ఈ చిత్రం సూపర్ హిట్గా నిలవడమే కాకుండా
ప్రభాస్ అభిమానులను చాలా ఏళ్ళ తరువాత సంబరాలు తెచ్చి పెట్టండి. రెండు భాగాలుగా రూపొందించిన ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక మొదటి వారం పూర్తి చేసుకునేప్పటికీ ఈ సినిమా 402 కోట్ల గ్రాస్ ని రాబట్టి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే మొదటి వారం రూ.550 కోట్లు, రెండోవారం దాదాపు 650 కోట్లు రాబట్టింది. ఇక ఈవారంతో 700 కోట్ల మార్క్ ని దాటేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా ఫినిష్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా దీంతో ప్రభాస్ మరో రికార్డ్ కూడా క్రియేట్ చేయడం విశేషం. 700 కోట్ల మార్క్ ఉన్న రెండు సినిమాలు గల హీరోగా ప్రభాస్ ఈ రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రభాస్ సినిమాలు బాహుబలి 2, సలార్.. ఈ మార్క్ ని క్రాస్ చేశాయి. కాగా సౌత్ హీరోల్లో 700 కోట్ల మార్క్ ని రెండుసార్లు అందుకున్న ఏకైక హీరో ప్రభాస్ కావడం విశేషం. దీంతో రెబల్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సంబరాలు జరుపుకుంటున్నారు.
BREAKING: Global Star #Prabhas' #SalaarCeaseFire ZOOMS past ₹7️⃣0️⃣0️⃣ cr gross mark at the WW Box Office.
Prabhas becomes the only star from south to HOLD… pic.twitter.com/2kmSWpM4r4
— Manobala Vijayabalan (@ManobalaV) January 9, 2024
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook