Spirit: సందీప్ రెడ్డి కార్ ఆపేసిన ప్రభాస్ ఫ్యాన్…భీమవరంలో రచ్చ రచ్చే

Prabhas: బాహుబలి తర్వాత వరస ప్లాపులతో సతమతమైన ప్రభాస్ ఫైనల్ గా ఈ మధ్య విడుదలైన సలార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో వరస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక చిత్రం చెయ్యమన్న విషయం తెలిసిందే…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 09:38 PM IST
Spirit: సందీప్ రెడ్డి కార్ ఆపేసిన ప్రభాస్ ఫ్యాన్…భీమవరంలో రచ్చ రచ్చే

Sandeep Reddy Vanga: బాహుబలి తరువాత మన రెబల్ స్టార్ ప్రభాస్ కి అనుకున్న రేంజ్ లో సూపర్ హిట్ రాలేదు. దీంతో నిరాశకు గురైన డార్లింగ్ ఫ్యాన్స్ కి ఫైనల్ గా సలార్ సూపర్ సక్సెస్ సాధించి ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ వరస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకపక్క మారుతీ సినిమాలో నటిస్తూ ఉండగా మరోపక్క నాగ్ అశ్విన్ కల్కి చిత్రం షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. మరో పక్క సలార్ పార్ట్ 2 కూడా త్వరలోనే చిత్రీకరించి విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలన్నీ పక్కన పెడితే ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టు గురించి కూడా ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సినిమాల తరువాత తాను వెంటనే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో  స్పిరిట్ పై షూటింగ్ ప్రారంభం కాకముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు చూపించిన ఉత్సాహం తెగ వైరల్ అవుతుంది.

భీమవరం అంటే ప్రభాస్ అభిమానులకు పెట్టింది పేరు. భీమవరంలో ప్రభాస్ కి విపరీతమైన అభిమానులు ఉంటారు. తాజాగా సంక్రాతికి సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి భీమవరం వెళ్ళాడు.  సంక్రాంతి నాడు సందీప్ రెడ్డి ని అక్కడ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ వెంటనే ఆయన కార్ ఆపేసి ప్రభాస్ పైనున్న అభిమానంతో ఎంతో ఆప్యాయంగా రచ్చ రచ్చ చేశారు. 

కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ సందీప్ కార్ వద్దకు వచ్చి.. ‘అన్న యానిమల్ సినిమా అదరగొట్టేశావ్. చాలా బాగుంది. మేమంతా ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా బాగా తీయాలన్నా, అదరగొట్టేయాలి. స్పిరిట్ సినిమా అదిరిపోవాలి అన్న, ఆల్ ది బెస్ట్ అన్న’ అంటూ తమ అభిమానాన్ని చూపించాడు. సందీప్ ఓకే ఓకే అంటూ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు.

 

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆప్యాయంగా చేసిన ఈ రచ్చ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే

Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News