Ayodhya Ram Mandir-Prabhas: యూపీలో అయోధ్య శ్రీ రామ మందిరం ప్రారంభోత్సవం త్వరలో జరగనుంది. ఈ ఆలయ ఓపెనింగ్‌కు తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇన్విటేషన్ ను పంపింది ఆలయ ట్రస్టు. అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతుంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగానే దేశంలోని రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖలకు ఆహ్వానాలను పంపుతుంది శ్రీరామజన్మభూమి తీర్థకేత్ర ట్రస్ట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తోపాటు కన్నడ స్టార్ యశ్, బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సన్నీ దేవోల్, టైగర్ ష్రాప్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇన్విటెషన్స్ పంపినట్లు సమాచారం. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, చిరంజీవి, రజినీకాంత్, అనుపమ్ ఖేర్, మోహన్‌లాల్, సంజయ్ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్, ధనుష్, రిషభ్ శెట్టికి ఆహ్వానాలు వెళ్లాయి.
Also Read: Salaar Vs Dunki: బాలీవుడ్ లో కార్పొరేట్ బుకింగ్స్.. సంచలన నిజాలు బయటపెట్టిన సందీప్ రెడ్డి సోదరుడు..
సినీ నటులకే కాకుండా క్రికెటర్లుకు కూడా ఆహ్వానాలను పంపించారు ట్రస్ట్ సభ్యులు. వీరిలో క్రికెడ్ గాడ్ సచిన్ టెండ్యూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. వీరితో పాటు ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా వంటి పారిశ్రామిక వేత్తలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. వీరితోపాటు ఇప్పటికే న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, పద్మ అవార్డుల గ్రహీతలు, రచయితలు, పూజారులు, సంగతీ విద్వాంసులు, సాధువులకు ఆహ్వానాలు పంపారు. దాదాపు 15 వేల మంది బస చేసేందుకు టెంటె సిటీ నిర్మిస్తున్నారు. రామాలయ నిర్మాణానికి నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
Also Read: Devil: బ్లాక్ బస్టర్ కి సిద్ధమైన కళ్యాణ్ రామ్.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook