Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి' నుంచి 'బుజ్జి' వీడియో విడుదల.. బుజ్జి ఓ రేంజ్‌లో ఉందిగా..

Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ ఈ నెల 17న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఓ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తన పెళ్లి గురించి శుభవార్త చెబుతాడని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న 'కల్కి 2898 AD' మూవీ కోసం ప్రభాస్ చేసినట్టు తెలిసింది. తాజాగా జరిగిన బిగ్ ఈవెంట్‌లో ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేసాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 22, 2024, 09:58 PM IST
Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి' నుంచి 'బుజ్జి' వీడియో విడుదల.. బుజ్జి ఓ రేంజ్‌లో ఉందిగా..

Prabhas - Kalki 2898 AD: కల్కి మూవీ కోసం దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ రోజు జరిగిన ఈవెంట్‌తో బుజ్జి అంటూ ప్రత్యేకమైన వైహికల్‌ను పరిచయం చేసారు. ఈ చిన్న వీడియో టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మొత్తంగా నాగ్ అశ్విన్ 'కల్కి' మూవీతో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అర్దమవుతోంది. అంతేకాదు ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు విజువల్స్ ఉన్నాయి. మొత్తంగా టైమ్ మిషన్ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇపుడు అంచనాలు ముందు నుంచి పీక్స్‌లో ఉన్నాయి. తాజాగా విడుదల బుజ్జి వీడియోతో అది వేరే లెవల్‌కి చేరిందనే చెప్పాలి. ఈ ఈవెంట్‌కు ప్రభాస్ తన బుజ్జి వాహనంలోనే రావడం విశేషం. మొత్తంగా ఎలక్షన్స్ సందర్భంగా వాయిదా పడ్డ ఈ సినిమా వచ్చే నెల 27న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఇకపై కల్కి మూవీ నుంచి పూటకో అప్డేట్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచే పనిలో మేకర్స్ పడ్డారు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు కూడా తోడయ్యారు. వీళ్లిద్దరు నటించడంతో అటు హిందీ, తమిళంలో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉండనున్నాయి. మొత్తంగా కీలకమైన సమ్మర్ కాకుండా.. అన్ సీజన్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో  చూడాలి.

ఈ సినిమాను తెలుగులో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వనీదత్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. తెలుగులో అప్పటి నుంచి ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్ వరకు దాదాపు నాలుగు తరాల అగ్ర హీరోలతో పెద్ద సినిమాలను నిర్మించిన ట్రాక్ రికార్డు అశ్వనీదత్ సొంతం. ఇపుడు ప్రభాస్‌తో మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటించింది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్.. 'సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం' మూవీ చేయనున్నాడు. అటు 'ది రాజా సాబ్', స్పిరిట్ మూవీలతో పాటు కన్నప్ప, హను రాఘవపూడి, సిద్ధార్ధ్ ఆనంద్ మూవీలు లైన్‌లో ఉన్నాయి.

ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..

ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News