Kalki 2898AD Movie HD Print Leaked Online: ప్రభాస్ కల్కి సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఏకంగా 600 కోట్లు సంపాదించి.. 1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. పాన్ ఇండియా పరంగా.. మంచి విజయాన్ని సాధించింది.
మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో.. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా వీక్ డేస్ అయినా సోమవారం, మంగళవారం కూడా ఈ చిత్రానికి మంచి వస్తువులు రావడం గమనర్హం. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకే కాకుండా.. హిందీ, తమిళ ప్రేక్షకులకు కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలను రుజువు చేస్తూ.. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
కాగా ఇలాంటి టైం లో ఈ సినిమా టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. అదేమిటి అంటే ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజులకే.. ఈ సినిమా హెచ్ డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది. ఈ సినిమా దాదాపు 3 గంటల రన్‍టైమ్ తో రాగా ఈ మొత్తం సినిమా ఆన్లైన్ లో పెట్టేయడంతో..సినీ ప్రేక్షకులు షాక్ కి గురవుతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషలలోనూ ఆన్లైన్లోకి వచ్చేయడం.
మహాభారతాన్ని.. రాబోయే యుగంతో.. కనెక్ట్ చేస్తూ.. నాగ్ అశ్విన్ తీసిన ఈ చిత్రం.. ప్రేక్షకుల దగ్గర నుంచే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అత్యంత తక్కువ బడ్జెట్ తో భారీ అవుట్ పుట్ ఇచ్చారు అని.. దర్శకుడిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఇలా పైరసీ ప్రింట్ ఆన్లైన్లోకి రావడం.. అందరిని కలవరపరుస్తోంది. ఇందువల్ల కలెక్షన్స్ పైన ప్రభావం పడుతుందని.. ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. మరి దీనిపై సినిమా యూనిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
కాగా ప్రభాస్ హీరోగా చేసిన ఈ చిత్రంలో దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంలో బుజ్జి పాత్రకి.. నాగ్ అశ్విన్ తో మహానటి సినిమా చేసిన కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
Also Read: Mokshagna: బిగ్ బ్రేకింగ్.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Also Read: Mahesh Babu: అభిమాని పాలిట మహేశ్ బాబు దేవుడు.. పేదింట చదువుల వెలుగులు నింపిన సూపర్‌స్టార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter