Kalki2898AD Release Trailer: కల్కి రిలీజ్ ట్రైలర్ విడుదల.. సమయం వచ్చింది.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..

Kalki Trailer: ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూన్ 27న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా యూనిట్ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 21, 2024, 09:28 PM IST
Kalki2898AD Release Trailer: కల్కి రిలీజ్ ట్రైలర్ విడుదల.. సమయం వచ్చింది.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..

Kalki Release Trailer: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి2898AD. ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మధ్య విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచగా.. ఈరోజు విడుదలైన రిలీజ్ ట్రైలర్ మరింత పెంచేసింది.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ నుంచి రిలీజ్ ట్రైలర్‌ను ఈరోజు సినిమా యూనిట్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ త్రైలర్ లోనే స్పెషల్ సర్ ప్రైజ్ కారెక్టర్లను రివీల్ చేశారు. ఇక ఈ.. ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది. ఈ ట్రైలర్‌ విడుదలతో సినిమా మీద అంచనాలు.. ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.  సమయం వచ్చింది అని అమితాబ్ డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్.. ఆధ్యాంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఫైనల్ గా ప్రభాస్.. ప్రిపేర్ అయి వచ్చాను అని చెప్పే డైలాగ్ తో ముగిసింది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News