Raja Saab: రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్!

Prabhas Raja Saab Update: ప్రస్తుతం వరస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ హీరో సలార్..కల్కి 2898AD లాంటి భారీ ప్రాజెక్టులు చేస్తున్న.. ఆయన అభిమానులు మాత్రం తెగ ఎదురుచూస్తున్న చిత్రం రాజా సాబ్. అందుకు ముఖ్య కారణం ఎన్నో రోజుల తర్వాత ప్రభాస్ మళ్ళీ ఈ చిత్రంలో డార్లింగ్ లాగా కనిపించబోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2024, 12:38 PM IST
Raja Saab: రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్!

Prabhas Sreenu: రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారుతి ఎన్నో సంవత్సరాల తరువాత ప్రభాస్ ని పక్కా కమర్షియల్ సినిమాలో చూపించబోతున్నారు అని నమ్మకంగా ఉన్నారు. అందుకే ఈ చిత్రం నుంచి ఎవరైనా ఒక చిన్న అప్డేట్ ఇస్తే చాలు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు ప్రభాస్ ని వింటేజ్ లుక్స్ తో చూపిస్తూ అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. తప్పకుండా ఈ చిత్రంలో ప్రభాస్ మరోసారి డార్లింగ్ లుక్స్ తో కనిపించబోతున్నారని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. 

ఈ నేపథ్యంలో ప్రభాస్ కి ఎంతగానో సన్నిహితుడైన ప్రభాస్ శీను రాజా సాబ్ గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ గా మారాయి.  ”రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ తెలుగు సినిమాలులా ఉండవు. ఎప్పుడు చూడని యాంగిల్స్ ఈ సినిమాలో మీరు చూస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ కాస్త ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని ప్రభాస్ శీను ఇచ్చిన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రియులను సైతం ఆకట్టుకుంటోంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుందని తెలుగు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి హార్రర్ బ్యాక్‌డ్రాప్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో అనగా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తీ అయ్యింది. ప్రభాస్ సలార్,‌ కల్కి సినిమా షెడ్యూల్స్ పూర్తి చేయగానే మరలా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొని ఈ  మూవీ బ్యాలన్స్ షూట్ ని కూడా పూర్తి చేసేయనున్నారు.

ఈ మూవీలోని ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్టైనింగా ఉంటుందట. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!  

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News