Adipurush Jai Shri Ram : అదిరిన ఆదిపురుష్‌ అప్డేట్.. జై శ్రీరామ్ నామమంత్రం.. లిరికల్ మోషన్ పోస్టర్ వైరల్

Jai Shri Ram Lyrical Motion Poster ఆదిపురుష్ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. మీరు ఒక వేళ చార్ ధామ్ యాత్రను చేయకుండా.. జై శ్రీరామ్ అనే మంత్రాన్ని జపించండి అంటూ లిరికల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జై శ్రీరామ్ మంత్రాన్ని వింటే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2023, 08:44 AM IST
  • నెట్టింట్లో రామ మంత్రం వైరల్
  • ఆదిపురుష్ నుంచి అప్డేట్
  • లిరికల్ మోషన్ పోస్టర్
Adipurush Jai Shri Ram : అదిరిన ఆదిపురుష్‌ అప్డేట్.. జై శ్రీరామ్ నామమంత్రం.. లిరికల్ మోషన్ పోస్టర్ వైరల్

Jai Shri Ram Lyrical Motion Poster యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా ఓమ్ రౌత్‌ దర్శకత్వంలో రూపొందిన హిందీ, తెలుగు సినిమా 'ఆదిపురుష్‌' జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇన్ని రోజులుగా ఆదిపురుష్ సినిమా మళ్లీ వాయిదా పడుతుందేమో అని ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో జూన్ లో సినిమాను విడుదల చేస్తాం అన్నట్లుగా మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు.

ఆదిపురుష్‌ ను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్‌ చేస్తున్నారు. నేడు సినిమా నుండి జై శ్రీరామ్.. అనే బిట్‌ సాంగ్ ను విడుదల చేసి అభిమానులను ప్రేక్షకులను మేకర్స్ సర్ ప్రైజ్ చేశారు. ప్రభాస్‌ అభిమానులతో పాటు ఇండియన్ సినీ ప్రేక్షకులందరిని కూడా ఈ సినిమా కచ్చితంగా సర్ ప్రైజ్ చేయడం ఖాయం అన్నట్లుగా మేకర్స్ చాలా నమ్మకంతో మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌ తో సినిమాపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా సినిమా లోని గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయి అంటూ ట్రోల్స్ వచ్చాయి. చిన్న పిల్లల కోసం తీసిన టీవీ సిరీస్ గ్రాఫిక్స్ ఉన్నట్లుగా సినిమా గ్రాఫిక్స్ ఉన్నాయి అనే విమర్శలు వచ్చాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News