Radheshyam Postponed:ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. 'రాధేశ్యామ్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అదేనా?

Radheshyam latest Update: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడినప్పుడే రాధేశ్యామ్ విడుదలపై కూడా సందేహాలు మొదలయ్యాయి. అయితే రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం.. ముందుగా ప్రకటించినట్లు గానే జనవరి 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు చెబుతూ వచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 11:29 AM IST
  • రాధేశ్యామ్ విడుదల వాయిదా పడే అవకాశం
  • ఇప్పటికే యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్‌కు సమాచారమిచ్చినట్లు ఊహాగానాలు
  • ఇవాళ అధికారికంగా వెల్లడించే అవకాశం
Radheshyam Postponed:ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. 'రాధేశ్యామ్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అదేనా?

Radheshyam latest Update: ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్' మూవీ విడుదల వాయిదా పడింది. ఓవైపు ఒమిక్రాన్ వ్యాప్తి, మరోవైపు కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో పెద్ద సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడక తాజాగా రాధేశ్యామ్ మేకర్స్ సైతం సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించారు. యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ మేరకు ప్రకటన చేశారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని... తమ పట్ల ప్రేమాభిమానులు చూపిన ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

 

 

సినిమా వాయిదాకు సంబంధించి మొదట అమెరికాలోని డిస్ట్రిబ్యూటర్స్‌కు అధికారిక సమాచారమిచ్చారని ప్రచారం జరుగుతోంది. వాయిదా విషయాన్ని ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడినప్పుడే రాధేశ్యామ్ విడుదలపై కూడా సందేహాలు మొదలయ్యాయి. అయితే రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం.. ముందుగా ప్రకటించినట్లు గానే జనవరి 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు చెబుతూ వచ్చారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉండటం..  జనం థియేటర్లకు దూరమయ్యే అవకాశం ఉండటంతో సినిమాను వాయిదా వేయడమే బెటర్ అని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. రెండు నెలలు వేచి చూశాక... మార్చి 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చేసిన ట్వీట్ కూడా సినిమా విడుదలపై ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. 'సమయాలు చాలా కఠినమైనవి... హృదయాలు బలహీనమైవి... మనసుల్లో కల్లోలం... జీవితం మనల్ని ఎలాంటి స్థితిలోకి నెట్టినా.. మన ఆశలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి.' అంటూ రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో 'రాధేశ్యామ్' సినిమా వాయిదా పడొచ్చుననే ప్రచారం మరింత ఊపందుకుంది.

ప్రభాస్-పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా హాలీవుడ్ ప్రేమ కథా చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా 'రాధేశ్యామ్' సినిమాను తెరకెక్కించారు. సినిమాలో ప్రభాస్ హస్త సాముద్రికుడిగా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్‌సెట్ అవుతున్నారు.

Also Read: శ్రీకాకుళంలో భూకంపం.. అంతా నిద్రలో ఉన్న వేళ.. భయంతో జనం పరుగులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News