Salaar Movie: 'సలార్'​లో మలయాళ స్టార్ హీరో.. స్వయంగా వెల్లడించిన ప్రభాస్..

Prithviraj Sukumaran: మలయాళ స్టార్​ హీరో పృథ్వీరాజ్..ప్రభాస్ 'సలార్​'లో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ వెల్లడించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 04:20 PM IST
  • సలార్ కోసం రంగంలోకి మలయాళ స్టార్
  • ఆ నటుడు ఎవరో లీక్ చేసిన ప్రభాస్
Salaar Movie: 'సలార్'​లో మలయాళ స్టార్ హీరో.. స్వయంగా వెల్లడించిన ప్రభాస్..

Prithviraj Sukumaran in Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' (Radhe Shyam) మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.  ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే 'కేజీఎఫ్'​ ఫేం ప్రశాంత్​నీల్​ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం 'సలార్'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) కీలకపాత్రలో నటిస్తున్నారని ప్రభాస్ వెల్లడించారు.'రాధేశ్యామ్'​ ప్రమోషన్​ల్లో భాగంగా..ఈ ఆసక్తికర విషయం పంచుకున్నారు.

సినిమా స్క్రిప్ట్ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్​కు నచ్చడం వల్లే ఒప్పుకున్నారని..ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభాస్. అయితే ఈ చిత్రంలో పృథ్వీరాజ్ రోల్ ఎలా ఉంటుంది? అన్నది మాత్రం ప్రభాస్ రివీల్ చేయలేదు. సలార్ (Salaar)లో ప్రభాస్ కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తుంది. ఇందులో ఆద్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన శ్రుతి హాసన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రవి బస్​రూర్​ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Prabhas-Anushka: ప్రభాస్‌పై అనుష్కకు ప్రేమ లేదా..లవ్ ఫెయిల్యూర్ అని ఎందుకన్నాడు, ఏం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News