Salaar Trailer: యూట్యూబ్‍లో 'సలార్‌' సంచలనం.. 18 గంటల్లోనే 100 మిలియన్ మార్క్.!

Salaar Movie: డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ ట్రైలర్ డిసెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజై 24 గంటలు కూడా గడవకముందే ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దూసుకుపోతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2023, 07:45 PM IST
Salaar Trailer: యూట్యూబ్‍లో 'సలార్‌' సంచలనం.. 18 గంటల్లోనే 100 మిలియన్ మార్క్.!

Salaar Trailer:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నయా మూవీ సలార్‌ (Salaar). ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ నిన్న (డిసెంబర్ 1) ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైన సలార్ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.  24 గంటలు గడవకముందే  100 మిలియన్ల (10కోట్లు)కు పైగా వ్యూస్ సాధించిన ట్రైలర్ గా సలార్ నిలిచింది. ఈ విషయాన్ని హొంబాలే ఫిల్మ్స్ సోష‌ల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

సలార్ జోరు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ ఉంది. సలార్ తెలుగు ట్రైలర్‌కు 29 మిలియన్ల వ్యూస్ వస్తే.. హిందీ ట్రైలర్‌కు సుమారు 49 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మిగతా భాషల్లో కూడా ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ కు ఈ స్థాయి రెస్పాన్స్ ఉంటే.. సినిమా రిలీజ్ కు ఏ రేంజ్ లో ఉంటుందోనని డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. 

ఈ మూవీలో ప్రభాస్ దేవ అనే పాత్రలో నటిస్తున్నాడు. డార్లింగ్ కు ప్రెండ్ గా పృథ్వీరాజ్.. వరదరాజ మన్నార్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ మలయాళ హీరో తండ్రిగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. బాబి సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరి ఆనంద్, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హొంబాలే ఫిల్మ్స్  నిర్మిస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News