Radhe Shyam shooting: ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో ఇటలీకి ప్రభాస్ అండ్ టీమ్ ?

Prabhas ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో ( Radhe Shyam ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే ( Pooja Hegde ) జంటగా నటిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల తరువాత సెప్టెంబరు 2వ వారం నుంచి ఈ మూవీ తిరిగి షూటింగ్‌ని ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Last Updated : Sep 1, 2020, 01:25 AM IST
Radhe Shyam shooting: ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో ఇటలీకి ప్రభాస్ అండ్ టీమ్ ?

Prabhas ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో ( Radhe Shyam ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే ( Pooja Hegde ) జంటగా నటిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల తరువాత సెప్టెంబరు 2వ వారం నుంచి ఈ మూవీ తిరిగి షూటింగ్‌ని ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం మేకర్స్ హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో రూ. 6 కోట్ల విలువైన వివిధ సెట్లను నిర్మించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాని తాజాగా నిర్మాతలు తమ ప్లాన్ మార్చుకుని చివరకు సినిమా యూనిట్‌ను ఇటలీలో షూటింగ్‌కి పంపిస్తున్నట్టు సమాచారం. Also read : Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్

సెట్టింగ్స్ వేసి కాకుండా డైరెక్ట్ ఒరిజినల్ లొకేషన్స్‌లోనే అనేక కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్రభాస్, అలాగే రాధే శ్యామ్ బృందం ప్రత్యేక చార్టర్ విమానంలో ( Special charter flights ) ఇటలీకి వెళ్లాలని యోచిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. కరోనా కేసులకు హాట్‌స్పాట్‌ అయిన ఇటలీలోనే సినిమా షూటింగ్ చేయడానికి వెళ్తుండటంపై సినీవర్గాల్లో చర్చ మొదలైంది. Also read : KGF Chapter 2: ప్రకాష్ రాజ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ దర్శకుడు 

పర్యాటక ప్రదేశాలకు యూరప్ ( Tourist spots in Europe ) పెట్టింది పేరు. కరోనా లాక్‌డౌన్‌ల తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ పర్యాటక ప్రదేశాలలో ఇప్పుడు జనారణ్యం ఎక్కువగా ఉండదు కనుక షూటింగ్ చేయడానికి అనువైన సమయం అని రాధే శ్యామ్ బృందం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణాలతో కరోనా రిస్క్ పొంచి ఉండటంతో ప్రభుత్వం అనుమతితో ఇటలీ వెళ్లడానికి ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ ( Special flight ) ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ విషయంపై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూనిట్ ఇంత రిస్కు తీసుకుంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. Also read : Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?

ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల విషయానికొస్తే.. రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ( Director Nag Ashwin ) ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా అనంతరం తన్హాజీ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కించనున్న దృశ్యకావ్యం ఆదిపురుష్ మూవీలో ( Adipurush movie ) ప్రభాస్ నటించనున్నాడు. Also read : Adipurush: మూవీ కోసం ప్రభాస్ ఎలా మారుతున్నాడో తెలుసా

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x