Temper Climax: పూరీ అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి.. వంశీ ఆ పని చేసి ఉండకపోతే డిజాస్టరే!

  Puri's Version of Temper Climax: టెంపర్ సినిమా ఎప్పుడు చూసినా ఇప్పటికీ ఆ సినిమా క్లైమాక్స్ వెంటాడుతూనే ఉంటుంది అయితే ఆ క్లైమాక్స్ పూరి జగన్నాథ్ ముందు అనుకున్నది కాదట, వంశీ బలవంతం చేయడంతో పెట్టాల్సి వచ్చిందట. 

Last Updated : Nov 23, 2022, 04:02 PM IST
Temper Climax: పూరీ అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి.. వంశీ ఆ పని చేసి ఉండకపోతే డిజాస్టరే!

Temper Climax Changed by Vakkantham Vamsi:పూరి జగన్నాథ్ కెరీర్ లో టెంపర్ ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమా. ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ ఈ సినిమా తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ కు కూడా బాగా ప్లస్ అయింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒకటి మాత్రం మరో ఎత్తు.

ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో ఈ సినిమా చూసిన అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా పూరి జగన్నాథ్ సొంత కథ కాదు వక్కంతం వంశీ అందించిన కథను పూరి జగన్నాథ్ సినిమాగా తెరకెక్కించిన సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా అయితే వక్కంతం వంశీకి, పూరి జగన్నాథ్ కి, ఎన్టీఆర్ కి బాగా ప్లస్ అయింది. బండ్ల గణేష్ కూడా బాగానే లాభాలు వచ్చాయి. అయితే పూరి అనుకున్న వర్షన్ మాత్రం ఈ సినిమాకు వేరుగా ఉందట.

టెంపర్ క్లైమాక్స్ పూరి మాత్రం వేరేగా తీయాలని భావిస్తే వక్కంతం వంశీ మాత్రం కచ్చితంగా పూరి జగన్నాథ్ లా కాకుండా కొత్త తరహా క్లైమాక్స్ నమ్ముకుని ముందుకు వెళితే మంచి ఎఫెక్ట్ ఉంటుందని భావించి తన మదిలో ఉన్న క్లైమాక్స్ ని పూరీ ముందు ఉంచారట. దానికి పూరీ కూడా ఎగ్జయిట్ అయ్యి అదే క్లైమాక్స్ తో సినిమా చేశారట. అసలు ఆధారాలు ఏవీ దొరకని దశలో ఎన్టీఆర్ తానే 5వ నిందితుడని అని ఆ అమ్మాయిని రేప్ చేసిన వారిలో తాను కూడా ఉన్నానని ఒప్పుకుంటాడు.

అలా అప్పటివరకు నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన పాత్ర తర్వాత మంచిగా మారడం ఆ తర్వాత ఏకంగా ఒక్క నిందితుడు కూడా తప్పించుకో కూడదు అనే ఉద్దేశంతో తానే నిందితుడిగా మారటం సినిమాకి బాగా ప్లస్ అయింది. ఈ విషయాన్ని తాజాగా వక్కంతం వంశీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించిన సీన్లు ఇప్పుడు చూసినా భలే ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. ఆ అంశం గురించి మీరేమంటారు?  కింద కామెంట్ చేయండి.

Also Read: Krishna Family: కృష్ణ-విజయనిర్మల ఆస్తుల పంపకాల్లో వివాదం.. అసలు నిజం బయటపెట్టిన నిర్మాత!

Also Read: Mega Family - Uday Kiran: మెగా ఫ్యామిలీ- ఉదయ్ కిరణ్ కు గొడవ పెట్టిన పత్రికాధినేత.. పవన్ కళ్యాణ్ మ్యాన్ హ్యాండ్లింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x