Pushpa 2 OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సాధించిన విజయం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. డిసెంబర్ 5న ధియేటర్‌లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం మూటగట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
పుష్ప 2 ది రూల్ సినిమా ఇప్పటికే అన్ని హిట్ సినిమా కలెక్షన్లను వెనక్కి నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 13 వందల కోట్లు వసూలు చేసింది. ఇంకా కలెక్షన్ల హోరు తగ్గలేదు. కలెక్షన్లలో ఎక్కడా తగ్గేదే లే అంటోంది. అల్లు అర్జున్ - రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా విడుదలై 10 రోజులు దాటినా ఇంకా అదే వసూళ్లు కన్పిస్తున్నాయి. అయితే చాలామంది ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఓటీటీ ప్రేమికులకు పుష్ప 2 గుడ్‌న్యూస్ అందుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్‌లో అల్లు అర్జున్ నటన పీక్స్‌కు చేరిందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమౌతోంది. 550 కోట్ల బడ్జెట్‌ను ఈ సినిమా కేవలం 2-4 రోజుల్లోనే చేరుకుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నాతో పాటు ఫహద్ ఫాజిల్, రావ్ రమేశ్, సునీల్, జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కన్పిస్తారు.
ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కీలకమైన అప్‌డేట్ ప్రచారంలో ఉంది. పుష్ప 2 ది రూల్ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 9వ తేదీన స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో వచ్చిన 40-50 రోజులకు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంటుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా జనవరి 9వ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also read: AP Holidays: ఏపీ అధికారిక సెలవుల జాబితా విడుదల, మొత్తం 23 రోజులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.