Raayan 1st Weekend Box Office Collections: ‘రాయన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ధనుశ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Raayan 1st Weekend Box Office Collection: ధనుశ్ తమిళ హీరో అయినా తెలుగులో సత్తా చాటుతున్నాడు. ఈయన సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈ  యేడాది ప్రారంభంలో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర పలకిరించినా ఈయన తాజాగా ‘రాయన్’ మూవీతో పలకరించాడు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 29, 2024, 01:47 PM IST
Raayan 1st Weekend Box Office Collections: ‘రాయన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ధనుశ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Raayan 1st Weekend Box Office Collection: జాతీయ ఉత్తమ నటుడు ధనుశ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా సత్తా చాటిన అతికొద్ది మంది హీరోల్లో ధనుశ్ ఒకడు. తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో ‘రాయన్’ మూవీ చేసాడు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సినిమా మొదటి  మూడు రోజుల్లో తెలుగులో రూ. 3.69 కోట్ల షేర్ (రూ. 7.05 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. తెలుగులో ‘రాయన్’ మూవీ రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర రూ. 1.81 కోట్లు రాబడితే హిట్టుగా నిలుస్తుంది. మరి ఈ సినిమాకు వచ్చిన టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకొని హిట్ గా నిలుస్తుందా అనేది చూడాలి.

ఇక రాయన్ వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిన వసూళ్ల విషయానికొస్తే..

తమిళనాడులో రూ. 34.95 కోట్ల గ్రాస్..
తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.05 కోట్ల గ్రాస్..
కర్ణాటకలో రూ. 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కేరళలో రూ. 2.90 కోట్ల గ్రాస్..
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ భారత కలిపి రూ. 1.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఓవర్సీస్ లో ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 20.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో ‘రాయన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 72.65 కోట్ల గ్రాస్ (రూ. 34.75 కోట్ల షేర్ )  రాబట్టింది.

రాయన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మూడు రోజుల్లోరూ. 34.75 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హిట్ అనిపించుకోవాలంటే మరో రూ. 11.25  కోట్ల షేర్ రాబడితే హిట్ అనిపించుకుంటుంది. ‘రాయన్’ మూవీకి వచ్చిన టాక్ ను బట్టి ఈ సినిమా ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మొత్తంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ధనుశ్ కు ఏ మేరకు లాభాలను తీసుకొస్తుందో చూడాలి. ప్రస్తుతం ధనుశ్.. తెలుగు, తమిళంలో బైలింగ్వల్ మూవీ ‘కుబేరా’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News