Ravi Kishan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై రేసు గుర్రం విలన్ సంచలన వ్యాఖ్యలు.. గత పాలకులు హిందువులు కాదంటూ..

Ravi Kishan on Ravi Kishan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగానే, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ వ్యవహారం ముదిరి పాగానా పడుతోంది. ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షతో పాటు పలు అంశాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హీట్ పుట్టించాయి. తాజాగా ఈ వ్యవహారంపై గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రేసు గుర్రం విలన్  రవికిషన్ శుక్లా  సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 24, 2024, 01:22 PM IST
Ravi Kishan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై రేసు గుర్రం విలన్ సంచలన వ్యాఖ్యలు.. గత పాలకులు హిందువులు కాదంటూ..

Ravi Kishan on Ravi Kishan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం రోజు రోజుకూ ముదురూతోంది. ఓ వైపు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. మరోవైపు తిరుమల వేదికగా భూమన కరుణాకర రెడ్డి ప్రమాణం.. ఇంకోవైపు ప్రకాస్ రాజ్ విమర్శలు.. దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం పీక్స్ కు చేరింది. దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు అందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

తాజాగా గోరఖ్ పూర్ ఎంపీ రవికిషన్ శుక్లా తిరుమల లడ్డూ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీటీడీ (తిరుమల తిరుపతి బోర్డ్) ఆలయాలన్ని నడిపినవారు హిందువులు కాదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వారి హయాంతో తిరుమలకు వచ్చిన భక్తులకు గొడ్డు మాంసంతో చేసిన లడ్డూలను ఇచ్చారని ఆరోపించారు. శాస్త్రాలతో పాటు శస్త్రాలను కూడా వెంట తీసుకుని వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనికోసం పోరాడేందుకు సాధువులు కూడా యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు రేసు గుర్రం విలన్. మొత్తంగా తెలుగు సినిమాల్లో విలన్ వేషాలు వేసే ఈయన ఇపుడు పవన్ కళ్యాణ్ లా రియల్ హీరోగా తిరుమల లడ్డూపై స్పందించడాన్ని హిందూ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే ఏపీ వేదికగా పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అన్నారు. తన తల్లి వంటి సనాతన ధర్మాన్ని కించ పరిచేలా చేస్తే  ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.  ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ పై తనదైన శైలిలో మండిపడ్డారు. సనాతన ధర్మంపై దాడికి దిగితే.. నేను స్పందించకూడదని మాట్లాడే అర్హత ప్రకాష్ రాజ్ కు లేదు. సెక్యూలర్ అంటే ఓన్లీ వన్ సైడ్ కాదు. రెండు సైడ్లు ఉండాలని ప్రకాష్ రాజ్ కు గడ్డి పెట్టాడరు.  ఆయనంటే నాకు గౌరవం ఉంది. కానీ నా సనాతన ధర్మాన్ని కించ పరిచిన వాళ్లు ఎవరైనా వాళ్ల తాట తీస్తానన్నారు. మరవైపు హీరో కార్తి పై కూడా తనదైన శైలిలో స్పందించారు.

నిన్న తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘లడ్డూ కావాలా’ నాయనా అంటూ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు కార్తి స్పందించిన తీరుపై కూడా పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా  స్పందించారు. మన సినిమాల్లో మన హిందూ ధర్మాన్ని మన దేవీ దేవతలను కించ పరుస్తున్నారు. అదే వేరే మతాలను కించపరిస్తే వాళ్లు ఊరుకుంటారా.. మనకో న్యాయం.. వేరే మతాలకో న్యాయం ఉండకూడదు. అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. అదే ఇస్లామ్, క్రిష్టియన్ మతాలకు చెందిన దేవుళ్లపై కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా అంటూ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. తన  హిందూ ధర్మంపై ఎవరైనా విషయం చిమ్మితే చివరి వరకు పోరాడతానన్నారు. అలా అని తాను ఇతర మతాలకు వ్యతిరేకం కాదన్నారు.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News