Racha Ravi : నా జీవితంలో ఆ రెండు డైలాగ్స్.. రుణపడి ఉంటా.. రచ్చ రవి ఎమోషనల్

Racha Ravi with Chammak Chandra And Venu రచ్చ రవి బుల్లితెరపై, వెండితెరపై కమెడియన్‌గా తన మార్క్ వేసిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోలో కమెడియన్‌గా నవ్విస్తూనే.. సినిమాల్లో రకరకాల పాత్రలు పోషిస్తూ వచ్చాడు. అలాంటి రచ్చ రవి.. ఈ మధ్య బలగంతో మెప్పించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 07:41 PM IST
  • నెట్టింట్లో రచ్చ రవి సందడి
  • ఆ రెండు డైలాగ్స్‌తో ఫేమస్
  • రుణపడి ఉంటానన్న కమెడియన్
Racha Ravi : నా జీవితంలో ఆ రెండు డైలాగ్స్.. రుణపడి ఉంటా.. రచ్చ రవి ఎమోషనల్

Racha Ravi in Balagam రచ్చ రవి ఇప్పుడు బలగం సినిమాతో ట్రెండింగ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆగుతవ రెండు నిమిషాలు అనే ఒక్క డైలాగ్‌నే సినిమా అంతా చెప్పి.. నవ్వులు పూయించాడు. ఆ డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు బలగం డైలాగ్, అప్పుడు జబర్దస్త్ షోలో ఇచ్చిన డైలాగ్‌ తన జీవితాన్ని మార్చేసిందంటూ రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు. దీనికి కారణమైన చమ్మక్ చంద్ర, వేణులకు థాంక్స్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

ఏమి ఇవ్వగలను మీకు.. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2013 మార్చ్ నెలలో మా చంద్రన్న తో చేసిన ఎపిసోడ్ 'తీసుకోలేదా రెండు లక్షల కట్నం'..మళ్లీ పది సంవత్సరాల తర్వాత 2023 మార్చి నెలలో రిలీజ్ అయిన “బలగం” సినిమాలో “ఆగుతావా రెండు నిమిషాలు”.. నాకు బాగా గుర్తు “తీసుకోలేదా రెండు లక్షల కట్నం” ఎపిసోడ్ తర్వాత మా “మల్లెమాల” కి ఫోన్ చేసి నా నెంబర్ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రశంస పత్రాలు ఇచ్చి ఆశీర్వదించారు..

మళ్లీ మన “బలగం” సినిమా లో 'ఆగుతావా రెండు నిమిషాలు'.. అనే డైలాగ్ కు మళ్లీ ప్రపంచ నలుమూలల నుండి ఒక మాటలో చెప్పాలంటే “అంబాల నుండి అమెరికా” దాకా వారి విలువైన సమయాన్ని కేటాయించి నా నెంబర్ కనుక్కొని ప్రశంస పత్రాలు ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 

Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

నా జీవితానికి గుర్తింపునిచ్చిన ఈ రెండు డైలాగులు ఇచ్చిన మీకు ఏమి ఇవ్వగలను రుణపడి ఉండడం తప్ప.. మీరు నమ్మి ఇచ్చిన అవకాశాల వల్ల వచ్చిన గుర్తింపుతో అద్భుతంగా ఎదిగి మీకు నమ్మకంగా ఉండడం తప్ప..మీ ఇద్దరికీ నేనేమి ఇవ్వగలను .. నా బలం...నా బలగం...అయిన నా శ్రేయోభిలాషులందరికీ.. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో నమస్కరిస్తూ.. జీవితంలో మిమ్మల్ని రంజింప చేస్తూ.. ఇంక మునుముందుకు ప్రయాణిస్తూ.. ఎల్లప్పుడు మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ మీ రచ్చ రవి (బలగం ఆటో రాజేష్) అని ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News