Radhe Shyam Song Teaser: రాధేశ్యామ్ నుంచి మరో సర్ ప్రైజ్.. 'సంచారి' సాంగ్ టీజర్ చూశారా?

Radhe Shyam Song Teaser: ప్రభాస్ లవర్ బాయ్ గా నటిస్తున్న 'రాధేశ్యామ్' చిత్రం (Prabhas Radhe Shyam Update) నుంచి మరో అప్టేడ్ వచ్చేసింది. ఈ సినిమాలోని 'సంచారి' సాంగ్ టీజర్ (Sanchari Song Teaser) ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ను డిసెంబరు 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 01:55 PM IST
    • 'రాధేశ్యామ్' చిత్రం నుంచి మరో సర్ ప్రైజ్
    • 'సంచారి' సాంగ్ టీజర్ ను విడుదల చేసిన చిత్రబృందం
    • ఫుల్ సాంగ్ ను డిసెంబరు 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన
Radhe Shyam Song Teaser: రాధేశ్యామ్ నుంచి మరో సర్ ప్రైజ్.. 'సంచారి' సాంగ్ టీజర్ చూశారా?

Radhe Shyam Song Teaser: 'రాధేశ్యామ్' నుంచి మరో అప్డేట్​ (Prabhas Radhe Shyam Update) వచ్చేసింది. 'సంచారి' అంటూ సాగే పాట టీజర్​ను (Sanchari Song Teaser) విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విజువల్స్​ చాలా రిచ్​గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ను డిసెంబరు 16న చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ టీజర్ ప్రభాస్ స్టైలిష్ లుక్ తో అలరిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31 రాత్రి లేదా జనవరి 1న సినిమా టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటించింది. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. 

1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో 'రాధేశ్యామ్' తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్(చేయి చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తి) కనిపించనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో (Sanchari Song Teaser) పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి ప్రభాస్‌ (Prabhas) ‘రాధేశ్యామ్‌’ రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలిజ్ కానుంది.  

ALso Read: Arjun Sarja Coronavirus: సినీ పరిశ్రమలో కరోనా కలవరం.. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్

Also Read: Ileana D' Cruz: వైట్ బికినీలో హాట్ బ్యూటీ...ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఇలియానా లేటేస్ట్ పిక్స్.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News