Rajtarun and Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడంటూ సంచలన వ్యాఖ్యలు..

Lavanya abortion: రాజ్ తరుణ్, లావణ్య ఘటనల్లో సినిమారేంజ్ లో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. లావణ్య ఇప్పటికే హీరో రాజ్ తరుణ్, మౌల్వీ మల్హాత్రా ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 10, 2024, 02:05 PM IST
  • లావణ్య కేసులో మరో ట్విస్ట్..
  • రాజ్ తరుణ్, మాల్వీపై మరోసారి కేసు..
Rajtarun and Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్  అబార్షన్ చేయించాడంటూ సంచలన వ్యాఖ్యలు..

Big twist in Lavanya and raj tarun malvi Malhotra issue: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఆమె ప్రియురాలు లావణ్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో తొలుత లావణ్య రాజ్ తరుణ్, మాల్వీ మల్హాత్రాలపై కేసు నమోదు చేసింది. తనతో పదకొండేళ్లపాటు రాజ్ తరుణ్.. లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. మాల్వీ పరిచయం అయ్యాక తనను దూరం పెడుతున్నాడంటూ కూడా ఆమె ఫిర్యాదులు చేసింది. రాజ్ తరుణ్ , తాను ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నామని చెప్పుకొచ్చింది. గుడిలోపెళ్లి సైతం చేసుకున్నామని చెప్పింది.

Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..

కానీ రాజ్ మాత్రం.. మాల్వీతో ఎఫైర్ పెట్టుకుని తమను దూరం పెట్టాడని కూడా చెప్పుకొచ్చింది.  ఇదిలా ఉండగా.. లావణ్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో పోలీసులు కావాలన్న ఆధారాలను సైతం చూపిస్తు, తనను రాజ్ ఎలా మోసానికి పాల్పడ్డారో పోలీసులకు చెప్పింది. తనను రాజ్ .. విదేశాలకు తీసుకెళ్లి మరీ అబార్షన్ చేయించాడని చెప్పింది. దానికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్లు సైతం.. పోలీసులకు అందించినట్లు లావణ్య తెలిపింది. తనను  అన్విత పేరుతో విదేశాలకు తీసుకెళ్లాడని కూడా చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా.. మరోవైపు మాల్వీ కూడా తనను , తమ తమ్ముడ్ని, నాన్నను కూడా లావణ్యను బెదిరింపులకు గురిచేసిందని కూడా మాల్వీ మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్వీ ఘటనలో తొలి నుంచి కూడా  బోలేడు ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. రాజ్ తరుణ్ తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని లావణ్య చెప్పింది.

Read more: Viral video: ముంబైలో వర్షం బీభత్సం... రైలు పట్టాలపై తిరుగుతున్న చేపలు.. వీడియో వైరల్..

మరోవైపు రాజ్ తరుణ్ మాత్రం.. లావణ్యకు డ్రగ్స్, మరో యువకుడితో ఎఫైర్ ఉందని కేవలం డబ్బుల కోసమే ఇదంతా చేస్తుందని కూడా అన్నారు. మాల్వీ కూడా తనకు రాజ్ మంచి ఫ్రెండ్ అని, కానీ లావణ్య లేని పోనీ ఆరోపణలు చేస్తుందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో ప్రస్తుతం లావణ్యకు అబార్షన్ జరిగిందనే విషయం మాత్రం కాస్త హట్ టాపిక్ గా మారింది. 

రాజ్ తరుణ్ లావణ్య కేసు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై  ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ లకు సైతం చేస్తున్నారు. మరోవైపు లావణ్య తాగి వాగిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అరియానాతో కూడా రాజ్ తరుణ్ ఎఫైర్ సాగించాడని కూడా వార్తలు వైరల్ గా మారాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News