Paa Paa: తెలుగులో పా.. పా.. సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం.. రాజా సాబ్ డైరెక్టర్ ఆసక్తికరమైన కామెంట్స్..

Paa Paa Movie: తమిళ్ లో గత ఏడాది విడుదలైన డా.. డా సినిమా మంచి హిట్ అయింది. కవిన్, అపర్ణ దాస్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తెలుగులో ఇప్పుడు పా.. పా.. అనే టైటిల్ తో విడుదల కాబోతోంది ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసిన రాజా సాబ్ డైరెక్టర్ మారుతీ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 4, 2024, 07:08 PM IST
Paa Paa: తెలుగులో పా.. పా.. సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం.. రాజా సాబ్ డైరెక్టర్ ఆసక్తికరమైన కామెంట్స్..

Paa Paa Telugu Movie: తమిళ్లో బ్లాక్బస్టర్ అయిన డా..డా సినిమా ఇప్పుడు తెలుగులో పా.. పా.. అని ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకులు ముందుకి రావడానికి సిద్ధం అవుతోంది. జెకె ఎంటర్టైన్మెంట్స్ బానర్ పై ప్రముఖ నిర్మాత నీరజా కోట ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అమెరికా ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. 

ఈ నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ మారుతి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అవుతూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో కూడా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది" అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

"ముఖ్యంగా ఈ సినిమా సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకులకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అని చెప్పుకొచ్చారు మారుతి. డా..డా సినిమా గత ఏడాది తమిళ్లో విడుదల అయిన ఈ సినిమాలో కవిన్, అపర్ణ దాస్ హీరో హీరోయిన్లుగా నటించారు. డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

కోలీవుడ్ లో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు కాసుల వ‌ర్షం కూడా కురిపించింది. చాలా త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం 30 కోట్ల దాకా వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ముఖ్యంగా మనసుకి హత్తుకునేలా ఉండే పాటలు ఈ సినిమాకు మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు. 

తెలుగులో కూడా ఈ పాటలు చాలా బాగా క్లిక్ అవుతాయి అని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. టైటిల్ కి తగ్గట్టుగానే తండ్రి కొడుకుల సెంటిమెంట్తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. పా.. పా.. సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది కానీ ఈ నిర్మాత నీరజా కోట అన్నారు. 

ఈ సినిమా ప్రేమ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలిపి ఉండే ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా అని అన్ని వర్గాల ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది అని.. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు ఈ సినిమాని విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News