Rajadhani Files:రాజధాని ఫైల్స్ మూవీకి లైన్‌ క్లియర్.. విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు..

Rajadhani Files: సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ ఏపీలో ఎన్నికల‌ వేడి రాజుకుంది. అందుకు సినిమాలు వేదికగా మారాయి. ఈ కోవలో 'రాజధాని ఫైల్స్' సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఏపీలోని అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉండటంతో కొంత మంది కోర్టును ఆశ్రయించారు. తీరా విడుదలయ్యాకా ఈ సినిమా విడుదలపై స్టే విధించింది. తాజాగా ఈ సినిమా విడుదలకు కోర్టు ఓకే చెప్పింది.

Last Updated : Feb 16, 2024, 12:00 PM IST
 Rajadhani Files:రాజధాని ఫైల్స్ మూవీకి లైన్‌ క్లియర్.. విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు..

Rajadhani Files: జనరల్ ఎలక్షన్స్‌కు మరో నెల రోజుల వ్యవధి కూడా లేదు. ఈ వేళలో ఏపీలో ఎన్నికల‌ వేడి రాజుకుంది. అందుకు సినిమాలు  వేదికగా మారాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేలా సినిమాలను ఆయుధాలుగా చేసిన ప్రజలపై ఒదలుతున్నారు. సినిమాలు రాజకీయాలపై ప్రభావం చూపుతాయా లేదా అనే సంగతి పక్కన పెడితే... ఆయా పొలిటికల్ మూవీస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈ కోవలో అధికార పార్టీకి బూస్ట్ ఇచ్చేలా యాత్ర 2 విడుదలైంది. మరోవైపు ఏపీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా 'రాజధాని ఫైల్స్' సినిమా వచ్చింది. నిన్న ఈ సినిమా  విడుదలపై అమరావతి కోర్టు స్టే విధించింది.  దాంతో రిలీజైన చాలా థియేటర్స్‌లో ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమాను ఆపేసారు. దీంతో కొంత మంది ఆ సినిమాలు ధర్నాకు కూడా దిగారు.  తాజాగా సెన్సార్ బోర్ట్ రివైజ్ కమిటీ ఈ సినిమా చూసి అంతా ఓకే అని చెప్పడంతో పాటు కోర్టుకు నివేదిక సమర్పించడంతో కోర్టు ఈ సినిమా విడుదలకు అనుకూలంగా తీర్పు నిచ్చింది.
 
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. అందుకోసం సినిమాలను వాడుకుంటున్నారు.  ఈ కోవలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల అడ్డుకోవడానికి అవసరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నించి ఒకింత సక్సెస్ అయ్యారు. చివరకు ఈ సినిమా విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. వ్యూహం, శపథం సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  

అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి టీడీపీ వాళ్లే 'రాజధాని ఫైల్స్' అంటూ ఓ సినిమాను తెరకెక్కించారనే ఆరోపణలు వచ్చాయి. ఒక్కడి అహం వేల మంది రైతుల కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంటూ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ అమరావతి రైతులను పట్టించుకోవడం లేదనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్  చేస్తోంది. ఈ సినిమాను నిన్న ఫిబ్రవరి 15న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. కానీ కొంత మంది ఈ సినిమా విడుదలపై స్టే కోరుతూ కోర్టుకు ఎక్కడం.. కోర్టు సినిమా విడుదలపై స్టే విధించడం.. ఆ సంఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఈ సినిమా విడుదలపై ఉన్న స్టేను తొలిగిస్లూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.  

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News