Laggam: తెలంగాణ పెళ్లినీ కన్నుల విందుగా చూపించబోతున్న లగ్గం..

Laggam Shooting: తెలంగాణ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఈ మధ్య మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఫిద, బలగం లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెలంగాణ పెండ్లిని కనులవిందుగా చూపించడానికి మనం ముందుకు వస్తోంది లగ్గం చిత్రం..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2024, 02:40 PM IST
Laggam: తెలంగాణ పెళ్లినీ కన్నుల విందుగా చూపించబోతున్న లగ్గం..

Rajendra Prasad: తెలంగాణ నేపథ్యంలో మరో సినిమా ప్రేక్షకులను మెప్పించడానికి రానుంది. సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్న చిత్రం లగ్గం. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు రమేష్ చెప్పాల ఈ సినిమాకు 
రచన -దర్శకత్వం వహిస్తున్నారు. 

మన తెలుగు సాంప్రదాయాన్ని ఈ చిత్రం ఎంతో చక్కగా చూపిస్తుందని తెలియచేశారు ఈ సినిమా మేకర్స్. తెలుగు సంప్రదాయంలో ముఖ్యంగా తెలంగాణ పెళ్లి నీ కన్నుల విందుగా చూపించబోతున్నానని..
ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మాట్లాడుకుంటారు… అని ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు ఈ సినీ దర్శకుడు. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందని తెలంగాణ పద్ధతి పెళ్లిని కళ్ళముందు ఉంచే చిత్రంగా ఈ సినిమాని రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు.  

ఇక కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్ గా నటిస్తున్న లగ్గం సినిమాలో రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో కనిపించదున్నారు. ఈ మధ్యనే ఇది చిత్రం గురించి చెబుతూ రాజేంద్రప్రసాద్ తన పెళ్లి పుస్తకం తరువాత ఈ చిత్రం అంతటి గొప్ప చిత్రంగా మిగులుతుందని చెప్పుకొచ్చారు. 

ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి చెబుతూ.."ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అందుకు భిన్నంగా లగ్గం సినిమా ఉండబోతోందని తెలంగాణదనం ఉట్టిపడే విధంగా దర్శకులు రమేష్ చెప్పాల ఈ సినిమాను తేరకెక్కిస్తున్నారని," అని తెలియజేశారు రాజేంద్రప్రసాద్. "రచయిత-దర్శకుడు రమేష్ చెప్పాల అన్ని హంగులతో లగ్గం యూనివర్స్ ను క్రియేట్ చేయబోతున్నారు."అని రోహిణి అన్నారు.

 ఈ చిత్రానికి సంగీతం..చరణ్ అర్జున్ అందిస్తుండగా..ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి.. కెమెరామెన్ గా బాల్ రెడ్డి బాధ్యతలు వహిస్తున్నారు.
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ తో పాటు రోహిణి,  ఎల్.బి శ్రీరామ్, సప్తగిర, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్తన్న , వంటి అనేకమంది ప్రముఖ నటినటులు నటిస్తున్నారు.

Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!

Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News