Lal Salaam Ban: తమిళ్ఇండస్ట్రీ తో పాటు తెలుగులో అలానే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ సూపర్ స్టార్ రజనీ కాంత్. రీసెంట్ గా రజనీ నటించిన జైలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టించింది. జైలర్ మూవీ సక్సెస్ ఇచ్చిన కిక్ తో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు రజనీ. అలాగే తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న లాల్ సలాం మూవీ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
లాల్ సలామ్ మూవీ లో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా..జీవిత రాజశేఖర్ మరొక కీలకపాత్ర పోషిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మతకల్లోల కథాంశం హైలైట్ చేస్తూ ఈ మూవీ ను తెరకెక్కించారు. సంక్రాంతి బరిలో దిగుతుంది అనుకున్న ఈ మూవీ..కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ నేపథ్యం మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9 అని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.
చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ రిలీజ్ విషయంలోనే మూవీ సమస్యలు ఎదుర్కొంటుందని టాక్. ఈ మూవీని కూవైట్ లో బ్యాన్ చేశారట. కువైట్ లాంటి దేశాలలో సినిమా రిలీజ్ కి సంబంధించి నియమ నిబంధనలు ఎంతో స్ట్రిట్ గా ఉంటాయి. లాల్ సలాం మూవీ ని అక్కడ బ్యాండ్ చేయడానికి మెయిన్ రీజన్ మూవీ కంటెంటే. కంటెంట్ లో ఏ మాత్రం తేడా కనిపించినా.. వెంటనే అక్కడ సినిమాను బ్యాన్ చేస్తారు.
సెన్సిటివ్ కాన్సెప్ట్ లేకపోయినప్పటికీ లాల్ సలామ్ మూవీలో ప్రధానంగా చూపించే హిందూ, ముస్లిం ఘర్షణ.. లాంటి అంశాల కారణంగా ఇది అక్కడ బ్యాన్ అయ్యింది. మిడిల్ వెస్ట్ లో కూడా ఇటువంటి సున్నితమైన కాన్సెప్ట్ల పై బ్యాన్ వర్తిస్తుంది. దీంతో ప్రస్తుతం కువైట్ తో పాటు మిడిల్ వెస్ట్ లో కూడా లాల్ సలాం బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్ధ లైక ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ లో రజనీ గెస్ట్ రోల్ చేస్తున్నప్పటికీ.. మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook