Rakendu Mouli Kranthi : లిరిసిస్ట్ వెన్నెల కంటి కుమారుడు హీరోగా 'క్రాంతి'.. ఆహాలో కొత్త సినిమా ఎలా ఉందంటే?

Kranthi Movie Review ఓటీటీలో ఇప్పుడు కొత్త కంటెంట్ వస్తోంది. కొన్ని సినిమాలు నేరుగానే ఓటీటీలోకి వస్తున్నాయి. జనాలను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు థియేటర్, ఓటీటీ ఆడియెన్స్ అంటూ సపరేట్ అయ్యారు. అయితే ఈ రెండింట్లోనూ కొన్ని సినిమాలు హిట్ అవుతుంటాయి. ఇప్పుడు క్రాంతి సినిమా ఆహాలోకి వచ్చి సందడి చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 11:37 AM IST
  • ఆహాలో కొత్త సినిమా సందడి
  • హీరోగా లిరిసిస్ట్ కుమారుడు
  • రాకేందు మౌళి క్రాంతి ఎలా ఉందంటే?
Rakendu Mouli Kranthi : లిరిసిస్ట్ వెన్నెల కంటి కుమారుడు హీరోగా 'క్రాంతి'.. ఆహాలో కొత్త సినిమా ఎలా ఉందంటే?

Kranthi Movie Review ఇప్పుడు దర్శకులు హీరోలు అవుతన్నారు.. హీరోలు దర్శకులు అవుతున్నారు.. ఇలా అన్ని రకాలుగా తమ తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్, రైటర్, లిరిసిస్ట్ అయిన రాకేందు మౌళి ఇప్పుడు హీరోగా మారిపోయాడు. నిఖిల్ 'కిరిక్ పార్టీ', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', సూపర్ ఓవర్‌లో మంచి పాత్రలు పోషించిన రాకేందు మౌళి ఇప్పుడు హీరోగా క్రాంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వి. భీమ శంకర్ దర్శకత్వంలో, భార్గవ్ మన్నే నిర్మించిన ఈ చిత్రం 'ఆహా'లో మార్చ్ 3 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

కథ
'రామ్'(రాకేందు మౌళి) ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే పక్కింటి కుర్రాడు టైపు. పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో బతుకుతుంటాడు. రామ్‌కి 'సంధ్య'(ఇనయా సుల్తానా)తో ప్రేమ వ్యవహారం నడుస్తుంటుంది. తన తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడమని రామ్‌ని సంధ్య కోరుతుంది. పెళ్లి సంబంధం కోసం బయలుదేరిన రామ్‌కి షాక్ తగులుతుంది. సంధ్య మృతదేహం చూసి రామ్ ఆశ్చర్యపోతాడు. ఏడాది తరువాత  రామ్ కుటుంబానికి తెలిసిన రమ్య (శ్రావణి) కనబడకుండా పోతుంది. అప్పటికే కొంత మంది అమ్మాయిలు కాకినాడలో కనిపించడం లేదని ఫిర్యాదులు వస్తుంటాయి. వీటి వెనుకున్న అసలు కథ ఏంటి? ముఠా అంతు చూసేందుకు రామ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? సంధ్య మరణం వెనుకున్న కథ ఏంటి? అనేది చూడాల్సిందే. 

నటీనటులు
రామ్ పాత్రలో రాకేందు మౌళి స్క్రీన్ మీద ఎంతో చక్కగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అదరగొట్టేశాడు. ఇనయ సుల్తానాకు ఇదొక కొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చేలా ఉంది. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. శ్రావణి శెట్టి , యమునా శ్రీనిధి ఇలా మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

విశ్లేషణ
ఓటీటీలో సినిమాలు ఎంతటి ఆదరణను దక్కించుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా తరువాత ఓటీటీ వినియోగం ఎక్కువగా పెరగడంతో కొత్త కొత్త కంటెంట్‌లను జనాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కంటెంట్‌లకు ఓటీటీలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇక క్రాంతి సినిమా కూడా అదే జానర్‌లో వచ్చింది.

ఓపెనింగ్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. అయితే రమ్య మిస్సింగ్ కేసు ప్రారంబిస్తాడో కథ, కథనంలో వేగం పెరుగుతుంది. అక్కడక్కడా డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.  కడుపు నొప్పి వస్తే కంగారు పడే మగాడు గొప్పా? పురిటినొప్పులు భరించే ఆడది గొప్పా? అనే డైలాగ్స్ గుర్తుండిపోతాయి. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించినా అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

దర్శకుడు 'భీమ శంకర్' ఎంచుకున్న పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ దాన్ని తెరపై తీసుకు రావడంలో కాస్త తడబడడ్డాడనిపిస్తుంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే సినిమా షూటింగ్ చేసి ఇంత క్వాలిటీ ఔట్ ఫుట్ ఇవ్వడం మాత్రం ప్రశంసించదగ్గ విషయం. 

'గ్యాన్ సింగ్' ఇచ్చిన మ్యూజిక్, ఆర్ఆర్ సినిమాకు ప్లస్. 'కిషోర్ బొయిదాపు' సినిమాటోగ్రఫీ, విజువల్స్ అలా కూర్చుండబెట్టేస్తాయి. 'కేసీ హరి' కొన్ని సన్నివేశాలకి ఎడిటింగ్ లో పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.

రేటింగ్ 2.5

Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా

Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News